• తాజా వార్తలు

మీ ఆధార్ పోయిందా? పేరు పుట్టిన తేదీ వాడి తిరిగి పొందండి ఇలా ?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

నేడు మన దేశం లో ఉంటున్న ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు ను కలిగి ఉండడం తప్పనిసరి అయింది. ఈ ఆధార్ కార్డు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పాస్ పోర్ట్ కు అప్లై చేయడం, రేషన్ కార్డు, వోటర్ కార్డు , కొత్త బ్యాంకు ఎకౌంటు , పెన్షన్, పిఎఫ్ ఇలా ఒకటేమిటి చివరకు మీ ఫోన్ లో సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆదా లేకపోతే పని జరుగదు.ఆధార్ రాకతో చాలా పనులు సులువు అయ్యాయి చెప్పవచ్చేమో! సరే ఇంతవరకూ బాగానే ఉంది. ఒకవేళ మీ ఆధార్ కార్డు పోతే పరిస్థితి ఏమిటి? తిరిగి పొందవచ్చా? ఖచ్చితంగా పొందవచ్చు. మీ ఆధార్ కార్డు పోయినా సరే మీ పుట్టిన తేదీ, పేరు మొదలైన వివరాలను వాడి మీ ఆధార్ కార్డు ను తిరిగి పొందవచ్చు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం

మీ పేరు, పుట్టిన తేదీ ప్రకారం ఆధార్ కార్డు పొందడం ఎలా?

  1. మొదటగా http://resident.uidai.gov.in/find-uid-eid  లింక్ ను ఓపెన్ చేయాలి.
  2. ఎడమ వైపు ఆధార్ నెంబర్ (UID) మరియు ఎన్ రోల్ మెంట్ నెంబర్ EID అని రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి.
  3. ఆధార్ నెంబర్ UID ని సెలెక్ట్ చేసుకుని మీ వ్యక్తిగత వివరాలు అక్కడ ఎంటర్ చేయాలి.
  4. ఇప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  5. మీ రిజిస్టర్డ్ మొబైల్ కు otp పంపబడుతుంది. దానిని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
  6. మీ మొబైల్ కు మీ అదార్ నెంబర్ తో కూడిన ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవడo ఎలా ?

  1. ఆధార్ యొక్క అధికారిక వెబ్ సైట్ అయిన https://eaadhaar.uidai.gov.in/ కి వెళ్ళండి.
  2. ఎన్ రోల్ మెంట్ నెంబర్ ను సెలెక్ట్ చేసుకోండి.
  3. మీ పూర్తి పేరు ను ఎంటర్ చేయండి.
  4. మీ ఈమెయిలు ఐడి ను ఎంటర్ చేయండి.
  5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను సబ్మిట్ చేయండి.
  6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు otp పంపబడుతుంది.
  7. అక్కడ ఉన్న బాక్స్ లో ఆ otp ని ఎంటర్ చేయండి.
  8. వెరిఫై otp అని ఉన్న వద్ద క్లిక్ చేయండి.
  9. డౌన్ లోడ్ ఈ ఆధార్ కార్డు అని ఉన్న క్లిక్ చేయండి. అంతే మీ ఆధార్ కార్డు ను డౌన్ లోడ్ చేసుకోండి.
  10. మీ ఆధార్ కార్డు ను ఓపెన్ చేయడానికి మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలను క్యాపిటల్ లెటర్స్ లో టైపు చేసి పాస్ వర్డ్ గా మీరు పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి.

జన రంజకమైన వార్తలు