• తాజా వార్తలు

మన మరణాన్ని గూగుల్ A.I. ఎలా పసిగడుతుంది?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ సిస్టం ద్వారా ఎవరైనా ఎప్పుడు చనిపొతారో తెలియజేసే ఒక వ్యవస్థను గూగుల్ తయారు చేసింది. అదే గూగుల్ AI. అవును మీరు చదువుతునది నిజం. ఇకపై ఎవరైనా పేషెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయితే ఒకవేళ అతను 24 గంటల లోపే చనిపోయే అవకాశం ఉంటే గూగుల్ AI దానిని ముందే పసిగడుతుంది. ఇది వేసే అంచనా 95 శాతం ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఇది ఎలా పని చేస్తుంది? దీని వివరాలేమిటి? తదితర విషయాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.

గూగుల్ AI మీ మరణాన్ని ఎలా అంచనా వేస్తుంది?

గూగుల్ AI ద్వారా డెవలప్ చేయబడిన ఈ సిస్టం ఒక 3D సెట్టింగ్ ను క్రియేట్ చేసుకుంటుంది. ఈ సిస్టం ఒక ఐదు ప్రత్యేక వర్చ్యువల్ స్నాప్ షాట్ లతో పనిచేస్తుంది. అవి షేప్, సైజు, ప్రత్యేక తరహా రంగు, మరొక ప్రత్యేక మైన రంగు మరియు వీటన్నింటి కాంబినేషన్.

గూగుల్ AI ఉపయోగించే డేటా ఏది?

అన్ని వర్చ్యువల్ స్నాప్  షాట్ లు కలిసి ఒక ఖచ్చితమైన 3D మోడల్ ను ఫాం చేస్తాయి.పేషెంట్ కు సంబందించిన డేటా ను ఈ సిస్టం తనలో నింపుకుంటుంది. అలాగే సదరు పేషెంట్ ఇంతకుముందు చికిత్స చేయించుకున్న హాస్పిటల్ లో ఉన్న డేటా, చికిత్స వివరాలు, ప్రస్తుతం పేషెంట్ యొక్క స్థితి, ల్యాబ్ రిజల్ట్స్ తదితర వివరాలను కూడా అదనంగా ఈ సిస్టం తీసుకుంటుంది.

ఈ ఫలితాలు ఎంతవరకూ ఖచ్చితంగా ఉంటాయి?

గూగుల్ చెబుతున్న ప్రకారం ఇది వెలువడించే వివరాలు దాదాపు 95% ఖచ్చితంగా ఉంటాయి. అంతేగాక ఇవి వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయి.

గూగుల్ AI ఎలాంటి మెడికల్ డేటా ను యాక్సెప్ట్ చేస్తుంది?

ఈ సరికొత్త గూగుల్ AI సిస్టం దాదాపుగా అన్ని రకాల మెడికల్ డాట్ లనూ యాక్సెప్ట్ చేస్తుంది. ఇది తీసుకునే ఏ డేటా నైనా విశ్లేషణ చేయగల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది.

పేషెంట్ ను కాపాడడానికి ఏవైనా మార్గాలు సూచిస్తుందా?

ఖచ్చితంగా సూచిస్తుంది. మనిషి ఎప్పుడు చనిపోతాడో అంచనా వేయడమే కాకుండా అతనిని బ్రతికించాలన్నా, జీవిత కాలం పొడిగించాలన్నా వైద్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన చికిత్స చేయాలి తదితర వివరాలను కూడా ఇది సూచిస్తుంది.

గూగుల్ AI ఇంకా వేటిని అంచనా వేస్తుంది?

ఈ సిస్టం కొన్ని పవర్ ఫుల్ మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇది పేషెంట్ యొక్క స్థితి , ఇంకా ఎంతకాలం ఆ పేషెంట్ హాస్పిటల్ లో ఉండగలడు తదితర వివరాలను కూడా ఇది అంచనా వేస్తుంది.

ఇది రోగాలను గుర్తించ గలదా?

గూగుల్ ఇంకా వ్యాధులను గుర్తించగలిగే టెక్నాలజీ ని డెవలప్ చేయలేదు. అయితే లక్షణాలను బట్టి వ్యాధులను గుర్తించే సిస్టం ను డెవలప్ చేసే పనిలో గూగుల్ ఉంది.

ఇది ఇంకా ఏ ఏ పనులు చేస్తుంది?

పిడిఎఫ్ లు చార్ట్ ల రూపం లో చికిత్స కు సంబందించిన వివరాలను అందించడం లో వైద్యులకు సహాయపడుతుంది. దీనివలన మరింత మెరుగైన వైద్యం అందించడానికి డాక్టర్ లకు వీలు అవుతుంది. అలాగే ఆరోగ్య భీమా విషయం లోనూ ఇది పేషెంట్ లకు సహాయపడుతుంది.

జన రంజకమైన వార్తలు