వాట్సాప్ వినియోగదారులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న గ్రూప్ వాయిస్ కాలింగ్, గ్రూప్ వీడియో కాలింగ్ ఆప్షన్లను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకూ బీటా వెర్షన్‌లో మాత్రమే ఉండే ఈ ఆప్షన్లను.. ఇప్పుడు కొత్త వెర్షన్‌లో తీసుకొచ్చింది. వాట్సాప్ కొత్త వెర్షన్‌లో ఇవన్నీ లభించనున్నాయి. ప్రస్తుతం ఈ ఆప్షన్స్‌ను సమర్థంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం! ముందుగా వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్‌ని ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐవోఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
వాయిస్ కాల్ ఎలా?
* వాట్సాప్‌ని ఓపెన్ చేయాలి.
* కాల్ పార్టిసిపెంట్‌ని ఎంచుకోవాలి.
* వాయిస్ కాల్ బటన్ మీద క్లిక్ చేయాలి.
* కాల్ కనెక్ట్ అయ్యాక.. స్క్రీన్‌పై కనిపించే add participant బటన్‌ని ఎంచుకోవాలి.
* రెండో వ్యక్తిని యాడ్ చేయాలి. తర్వాత Add బటన్ మీద క్లిక్ చేయాలి.
* యాడ్ పార్టిసిపెంట్ ద్వారా మరింత మందిని యాడ్ చేసుకుని మాట్లాడుకోవచ్చు.
గ్రూప్ వీడియో కాల్
* వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేయాలి.
* కాల్ బటన్‌ని ఎంచుకోవాలి. అందులో Dialerని సెలెక్ట్ చేసుకోవాలి.
* ఇందులో మొదటి వ్యక్తిని ఎంచుకుని వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
* ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత.. Add Person మీద క్లిక్ చేయాలి.
* రెండో పర్సన్‌ని సెలక్ట్ చేసుకోవాలి.
* ఒకేసారి నలుగురికి మాత్రమే వీడియో గ్రూప్ కాల్ చేసే అవకాశం ఉంది.