• తాజా వార్తలు

ఆధార్ కార్డు పోయిందా, అయితే డూప్లికేట్ ఆధార్ కార్డును ఎలా పొందాలనే సమాచారం మీకోసం

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

ఆధార్ అనేది ఇప్పుడు నిత్య జీవితంలో భాగమైపోయింది. అన్ని రకాల గవర్నమెంట్ రిలేటెడ్ పనులకు ఈ కార్డును ఉపయోగిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయాలన్నా, అలాగే గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, లేక మరేదైనా అప్లయి చేయాలన్నా ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది. ఒక్కోసారి ఈ ఆధార్ కార్డు మిస్సయిపోతూ ఉంటుంది. మరి అలా మిస్సయినప్పుడు డూప్లికేట్ ఆధార్ బుక్ చేయడం ఎలా అనేదానిపై మీకు సమాచారాన్ని ఇస్తున్నాం. ఆధార్ కార్డు మిస్సయితే ఈ కింది పద్ధతుల ద్వారా తిరిగి తెచ్చుకోండి.

స్టెప్ 1
పిసి బ్రౌజర్ లో 'www.uidai.gov.in' సైట్ ను ఓపెన్ చేయండి. 'Aadhar service' సెక్షన్ ను ఓపెన్ చేసి 'Retrieve Lost or Forgotten EID/UID' లింక్ ను క్లిక్ చేయండి.
స్టెప్ 2
తదుపరి పేజీలో, అవసరమైన వివరాలను నమోదు చేయండి. పేరు, ఇ-మెయిల్, మొబైల్ నంబర్ మరియు సిస్టమ్-జనరేటెడ్ సెక్యూరిటీ కోడ్ లాంటి వివరాలను ఎంటర్ చేయండి. 
స్టెప్ 3
అలాగే, మీరు EID (నమోదు సంఖ్య) లేదా UID (ఆధార్ నంబర్) ను తిరిగి పొందాలనుకుంటున్నారా అని నిర్దేశించండి. చివరగా, అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, దిగువ ''Send OTP'' అనే బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 4
మీ ఆధార్-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వన్ -టైం పాస్వర్డ్ పంపబడుతుంది.వెంటనే ఆ OTP ను ఎంటర్ చేసి తనిఖీ చేయండి.విజయవంతంగా తనిఖీ చేసిన తరువాత, మీ ఆధార్ నంబర్ మీ ఇ-మెయిల్ మరియు మొబైల్ నెంబర్ కు పంపబడుతుంది.

జన రంజకమైన వార్తలు