ప్రస్తుతం ఒకే గూగుల్ అకౌంట్‌ని అన్ని అవసరాలకు ఉపయోగిస్తే గజిబిజిగా మారుతుంది. బిజినెస్ అవసరాలకు, వ్యక్తిగత, ఇతర కార్యకలాపాల నిమిత్తం వేర్వేరుగా గూగుల్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. వీటన్నింటినీ క్రియేట్ చేసుకోవడం ఒకటైతే.. మేనేజ్ చేసుకోవడం మరింత సవాలుగా మారింది. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి షిఫ్ట్ అవ్వడం చికాకు కలిగిస్తుంది. వీటన్నింటినీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోనే సులువుగా మేనేజ్ చేసుకోవడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. వీటిని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం! ప్రస్తుతం మీకు ఒకటి కంటే ఎక్కువ గూగుల్ అకౌంట్స్ ఉన్నాయని భావించి ఈ స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.
ఎలా అంటే..
Step 1: ఆండ్రాయిడ్ డివైజ్‌లో సెట్టింగ్స్‌ని ఓపెన్ చేసి అందులో అకౌంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
Step 2: స‌్క్రీన్ అడుగు భాగంలో Add account కనిపిస్తుంది. కొన్నిసార్లు దీని ముందు + అనే సింబల్ ఉంటుంది. ఇందులో
Google మీద క్లిక్ చేయాలి. డివైజ్‌కి పాస్‌వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకుంటే ముందుగా దానిని కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.
Step 3: ఇందులో మళ్లీ ఈమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్, టూ ఫ్యాక్టర్ ఆథంటిఫికేషన్ సాయంతో గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్త లాగిన్ స్క్రీన్ క్రియేట్ అవుతుంది. సైన్ ఇన్ అయిన తర్వాత.. కొత్త గూగుల్ అకౌంట్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది.
Step-4: తర్వాత గూగుల్ అకౌంట్‌కి ఆండ్రాయిడ్ సింక్రనైజ్ అవుతుంది. ఏ అకౌంట్‌ని ఉపయోగించాలనుకుంటున్నామో తెలిపేందుకు.. సెట్టింగ్స్‌లో అకౌంట్స్‌లోకి వెళ్లాలి. తర్వాత గూగుల్ మీద ట్యాప్ చేసి ఏదో ఒక అకౌంట్‌ని సెలక్ట్ చేసుకోవాలి.
Step -5: ఏదైనా అకౌంట్‌ని తొలగించాలంటే.. కుడివైపు కనిపించే vertical ellipsis ఐకాన్‌ని ట్యాప్ చేసి Remove account ఆప్షన్‌ని ఎంచుకోవాలి.