• తాజా వార్తలు

జియో యాప్‌లో Do not Disturbని యాక్టివేట్ చేసుకోవడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

మీరు జియో సిమ్ వాడుతున్నారా.. అయితే మీరు ఈ ఫీచర్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ట్రాయ్ తీసుకువచ్చిన Do not Disturb సేవలను జియో యాప్ ద్వారా మీరు యాక్టివేట్ చేసుకునే సౌకర్యాన్ని జియో కల్పిస్తోంది. మీరు జియో సిమ్ వాడుతున్నట్లయితే ఈ సింపుల్ ట్రిక్ ద్వారా Do not Disturbని యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ని ఓ సారి పరిశీలిస్తే...

ముందుగా మీరు మీ ఫోన్‌లో మై జియో యాప్ ఓపెన్ చేయండి. జియో డేటాతోనే ఆన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ వైఫైకి కనెక్ట్ చేసినట్టైతే ఆ వైఫై డిస్ కనెక్ట్ చేసి మొబైల్ డేటా ఆన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తరువాత లెఫ్ట్ టాప్‌లో త్రీ లైన్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ పేజీ ఓపెన్ చేయండి. అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో సర్వీస్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో Do not Disturb ఆప్షన్ కనిపిస్తుంది. 

ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు డు నాట్ డిస్టర్బ్‌కి సంబంధించిన పలు సెట్టింగ్స్ కనిపిస్తాయి. అందులో FULL DND సెలెక్ట్ చేసుకుంటే ఇక మీకు ఎలాంటి ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు రావు. FULL DND కాకుండా బ్యాంకింగ్, హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి వేర్వేరు ఆప్షన్స్ ఉంటాయి. 

మీకు ఏ ప్రమోషనల్ మెసేజెస్, కాల్స్ అవసరం లేదనుకుంటే ఆ ఆప్షన్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మీ డీఎన్‌డీ రిక్వెస్ట్ వెళ్తుంది. రిఫరెన్స్ నెంబర్ మెయిల్, ఎస్ఎంఎస్ వస్తాయి. వారం రోజుల్లో మీ డీఎన్‌డీ యాక్టివేషన్ పూర్తవుతుంది. Do not Disturb యాక్టివేట్ అయిన తర్వాత మీకు ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్ రావు.

జన రంజకమైన వార్తలు