• తాజా వార్తలు

గూగుల్ పే ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ చేయడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

గూగుల్ నుంచి వచ్చిన తేజ్ యాప్  వచ్చిన అనతి కాలంలోనే వినియోగదారుల మనసును విపరీతంగా గెలుచుకున్న సంగతి అందరికీ తెలిపిందే. వచ్చిన అత్యంత తక్కువ సమయంలోనే ఈ పే యాప్ అందరికీ చేరువైంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వినియోగదారులను కట్టిపడేసింది. అనేక రకాల ఆఫర్లను, డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ప్రైజులను అందిస్తూ ముందుకు వెళుతున్న ఈ దిగ్గజం తాజాగా రైల్వే బుకింగ్ ఆపసన్ ను తీసుకువవచ్చింది. ఇప్పుడు గూగుల్ పే యూజర్లు ట్రైన్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. 

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) భాగస్వామ్యంతో గూగుల్ పే ఈ సర్వీసులు అందిస్తోంది. ట్రైన్ టికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా టికెట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే బుకింగ్ టికెట్లను క్యాన్సల్ కూడా చూసుకోవచ్చు. 

గూగుల్ పే యాప్ సాయంతో రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకోవాలంటే యూజర్లకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉండాలి. యూజర్లు గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి. బిజినెస్ సెక్షన్‌లోకి వెళ్లాలి. ట్రైన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ నుంచి టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

పుల్ ప్రాసెస్ ఇదే
గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి
అందులో కనిపించే బిజినెస్ సెక్షన్ లోకి వెళ్లండి 
అక్కడ కనిపించే ట్రైన్ సెక్షన్ క్లిక్ చేయండి
న్యూ టికెట్ ఆప్సన్ ఎంచుకోండి
మీరు ప్రయాణించాల్సిన తేదీ, ప్రదేశం , గమ్యం వివరాలను ఎంటర్ చేస్తే మీకు అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలు అక్కడ కనిపిస్తాయి. 
దీంతో పాటు మీరు ఫలానా ట్రైన్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ ట్రైన్ కోడ్ వివరాలను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
మీరు టికెట్ బుక్ చేసని తరువాత ఓ సారి సరిచూసుకుని ఒకే బటన్ ట్యాప్ చేయండి.
ఆ తర్వాత మీకు మీ IRCTC user IDలోకి లాగిన్ అవ్వండి. అక్కడ మీ బుకింగ్ వివరాలు ఎంటర్ చేసి అమౌంట్ పే చేయడం ద్వారా మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. 

జన రంజకమైన వార్తలు