యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అందించే ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది.దీనికి తోడు పన్నుదారులు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందేనని ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ లో ఏదైనా మార్పు చేయాలంటే ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది. అయితే ఇప్పుడు OTP ఆధారిత వెరిఫికేషన్ ద్వారా మీ అడ్రస్ ఈజీగా మార్చేసుకోవచ్చు. దీనికోసం మీ ఆధార్ కార్డు మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్‌తో అటాచ్ అయి ఉండాలి. ఆధార్ కార్డు యూజర్లు సమీపంలోని ఆధార్ సెంటర్లకు లేదా UIDAI వెబ్ సైట్ (uidai.gov.in) లాగిన్ కావొచ్చు.
ఆధార్ అడ్రస్ మార్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లు
మీ రీసెంట్ ఫొటోను Scan చేసి Upload చేయాల్సి ఉంటుంది. (లేదా) ఒరిజనల్ అడ్రస్ ఫ్రూప్ (PoA) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. మీరు ఇచ్చే ఫ్రూఫ్ డాక్యుమెంట్ కు అడ్రస్ అప్ డేట్/కరెక్షన్ రిక్వెస్ట్ ఫామ్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు స్టేట్ మెంట్ లేదంటే బ్యాంకు పాస్‌బుక్, పోస్టు ఆఫీసు అకౌంట్ స్టేట్ మెంట్/పాస్‌బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక డాక్యుమెంట్‌ను అడ్రస్ ఫ్రూప్‌గా ఇవ్వొచ్చు.
Onlineలో ఆధార్ కార్డు అడ్రస్ మార్చడం ఎలా ?
ముందుగా ఆధార్ అధికారిక వెబ్ సైట్ uidai.gov.in విజిట్ చేయండి. ఆధార్ సెల్ఫ్ సర్వీసు అప్ డేట్ పోర్టల్ My Aadhaar లింక్ పై క్లిక్ చేయండి. అక్కడ మీకు Update Your Aadhaar అనే అప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తరువాత వచ్చే Update Your Address Online అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'proceed to update address' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్, Captcha వెరిఫికేషన్ ఎంటర్ చేయండి.. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తరువాత ఆధార్ లో Log -in అవ్వండి.
ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
Update Address via అడ్రస్ ఫ్రూప్
Update address via సీక్రెట్ కోడ్
మీరు Update Address via అడ్రస్ Proof సెలెక్ట్ చేస్తే :
అందులో కొత్త అడ్రస్ వివరాలు ఎంటర్ చేయండి. మీ డాక్యుమెంట్లు ఏమి ఉన్నాయో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (BPO)సర్వీసు ప్రొవైడర్ ఆప్షన్ Select చేసుకోండి. Submit రిక్వెస్ట్ బటన్ పై క్లిక్ చేయండి.
Secret Code ద్వారా అడ్రస్ మార్చాలంటే :
అడ్రస్ లో ఉండే కుటుంబ సభ్యులు ఎవరిది అయిన ఉంటే వారి అడ్రస్ ప్రూఫ్ ఆధారంగా అథంటికేషన్ పూర్తి చేసుకోవచ్చు. 30 వర్కింగ్ డేస్ లో మీరు ఇచ్చిన అడ్రస్ కు సీక్రెట్ కోడ్ తో కూడిన లెటర్ పోస్టు ద్వారా వస్తుంది. కొత్త అడ్రస్ కోసం దరఖాస్తు చేసిన వ్యక్తితో పాటు, అడ్రస్ ప్రూఫ్ ఇచ్చిన వ్యక్తి మొబైల్ నెంబర్ కూడా ఆధార్ ఎటాచ్ అయి ఉండాలి. లెటర్ అందుకున్నాక.. ఆన్ లైన్ అడ్రస్ అప్ డేట్ పోర్టల్ లాగిన్ కావాల్సి ఉంటుంది. అప్ డేట్ అడ్రస్ వయా సీక్రెట్ కోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి అడ్రస్ వివరాలు రివ్యూ చేసి ఫైనల్ రిక్వెస్ట్ Submit పై క్లిక్ చేయండి. మీకో 14అంకెల URN (Update Request Number) వస్తుంది. ప్రాసెస్ పూర్తి అవుతుంది.