ఈ రోజుల్లో ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌లు వాడుతున్నారు. ట్రాయ్ స్ట్రిక్ రూల్స్ ప్రవేశపెట్టక ముందు అయితే ఒక్కొక్కరు లెక్కలేనన్ని సిమ్‌లు వాడేవారన్న సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. డేటా ఆఫర్, అలాగే ఉచిత కాల్స్ ఆఫర్లు ఇచ్చే కంపెనీల సిమ్‌లు తీసుకోవడం ఆఫర్ అయిపోగానే వాటిని మూలన పడేయడం అనేది కామన్ అయిపోయింది. అయితే ఆధార్ లింక్‌తోనే ఫోన్ సిమ్ కార్డు తీసుకోవాలని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేయడంతో దీనికి కొంతమేర పుల్‌స్టాప్ పడింది. అయితే మీరు వాడుతున్న సిమ్ మీ పేరు మీద ఉందా లేక వేరే వారి పేరు మీద ఉందా అన్ని విషయాలను తెలుసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్..ఎయిర్ టెల్ కష్టమర్లు ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు.
Tricks
1. ముందుగా మీరు Airtel అఫిషియల్ వెబ్ పేజీలోకి వెళ్లాలి. అక్కడ మీకు Airtel.in Selfcare Login అనే ఆప్సన్ కనిపిస్తుంది.
2. అది క్లిక్ చేయగానే మీకు అక్కడ నంబర్ అలాగే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు పాస్‌వర్డ్ మరచిపోయినట్లైతే గెట్ ఓటీపీ అనే ఆప్సన్ క్లిక్ చేస్తే మీ నంబర్ కు ఓటీపీ వస్తుంది.
3. అది ఎంటర్ చేసిన తరువాత మీకు అక్కడ Airtel Manage account అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు సిమ్ నంబర్ ఓనర్ పేరు కనిపిస్తాయి. నంబర్ మీద క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలను పొందవచ్చు.
4. ఇక్కడ మీకు అడ్రస్, సిమ్ ఓనర్ పేరు, రెసిడెన్సియల్ అడ్రస్, సిమ్ యాక్టివేషన్ డేట్,స్టేటస్, ఫ్రీ పెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్, కస్టమర్ ఐడీ,వంటి వివరాలు అన్నీ కనిపిస్తాయి.