గత కొద్ది కాలంగా ఫేస్ బుక్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రత్యేకించి కేం బ్రిడ్జ్ అనలిటికా అంశం దగ్గర నుండీ ఫేస్ బుక్ లో సెక్యూరిటీ పై చాలా మంది నమ్మకం కోల్పోతున్నారు. ఈ నేపథ్యం లో ఫేస్ బుక్ ఎకౌంటు ను వదిలిపెట్టాలని కూడా చాలా మంది అనుకుంటున్నారు. మీరు కూడా అలానే మీ ఫేస్ బుక్ ఎకౌంటు ను డిలీట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీ ఎకౌంటు కు సంబందించిన ఫోటో లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని ఫేస్ బుక్ కల్పిస్తుంది. ఫోటో లు, మీరు చేసిన పోస్ట్ లు అన్నింటినీ బ్యాక్ అప్ తీసుకునే అవకాశాన్ని ఫేస్ బుక్ కల్పిస్తుంది. ఒకవేళ మీ ఎకౌంటు ను మీరు డిలీట్ చేసుకోకపోయినా సరే మీ ఫోటో లను మీరు బ్యాక్ అప్ తీసుకుంటే నష్టం ఏమీ లేదు కదా! అందుకే ఈ ఫేస్ బుక్ లో ఉన్న ఫోటో లను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో సవివరంగా ఇవ్వడం జరిగింది.
ఫోటో లు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?
స్టెప్ 1: ఫేస్ బుక్ ఓపెన్ చేసి కుడి వైపు పైభాగాన ఉండే డౌన్ యారో పై క్లిక్ చేయాలి . మెనూ లో ఉన్న సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 2: జనరల్ ఎకౌంటు సెట్టింగ్స్ లో డౌన్ లోడ్ ఎ కాపీ అఫ్ యువర్ ఫేస్ బుక్ డేటా అని ఉన్న దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : న్యూ ఫైల్ ట్యాబ్ క్రింద డీ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫోటోస్ ఆప్షన్ ప్రక్కనున్న చెక్ బాక్స్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. డేటా రేంజ్ మరియు ఫార్మాట్ ను కూడా స్లేచ్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో ఫోటో లను చూడడానికి HTML ఫార్మాట్ బాగా పనిచేస్తుంది. అలాగే JSON ఫార్మాట్ అయితే డేటా ను వేరొక సర్వీస్ కు చాలా సులభంగా ఇంపోర్ట్ చేస్తుంది. మీడియా క్వాలిటీ సెట్టింగ్స్ లో హై ను సెలెక్ట్ చేసుకుంటే ఫోటో లను బెస్ట్ క్వాలిటీ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
స్టెప్ 3 : క్రియేట్ ఫైల్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ ఫైల్ ప్రోఅసేసింగ్ అవుతున్నట్లు ఫేస్ బుక్ చూపిస్తుంది. కొద్ది సేపటి తర్వాత మీ ఫేస్ బుక్ డేటా డౌన్ లోడింగ్ కు రెడీ గా ఉఇన్నత్లు ఒక నోటిఫికేషన్ మరియు ఈ మెయిల్ వస్తుంది.
స్టెప్ 5 : నోటిఫికేషన్ పై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న ఫైల్స్ లో ఫోటోస్ ఆర్కైవ్స్ కనిపిస్తాయి.
స్టెప్ 6: డౌన్ లోడ్ బటన్ పై క్లిక్ చేయాలి. కొన్ని సెక్యూరిటీ కారణాల దృష్ట్యా డౌన్ లోడ్ చేయడానికి ముందు మీ ఫేస్ బుక్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.
గమనిక : మీరు డౌన్ లోడ్ చేసుకున్న డేటా 4-5 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఫైల్ సైజు అనేది మీ డేటా ను బట్టి ఆధార పడి ఉంటుంది.