మీరు అనేక అకౌంట్లను వాడుతున్నారా..అయితే వాటిలో కొన్ని ఖాతాలను మూసేయాలనుకుంటున్నారా.. అయితే ఇందుకోసం ఏం చేయాలి. ఖాతాలను ఎలా డిలీట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. అలాంటి సమయంలో ఆ ఖాతాలను ఎలా డిలీట్ చేయాలా అని తెగ ఆలోచిస్తుంటారు. అయితే ఈ ఖాతాలను డిలీట్ చేసేందుకు ఓ మార్గం ఉంది. అదేంటో మీరే చూడండి.
deseat.me వెబ్‌సైట్
అక్కర్లేని వెబ్‌సైట్లలో ఉన్న ఖాతాలను తొలగించడానికి deseat.me వెబ్‌సైట్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా మీ అకౌంట్ల వివరాలన్నీ తెలుస్తాయి. deseat.me వెబ్‌సైట్‌లో మీ మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యే సమయంలో అథెంటికేషన్ ప్రక్రియ అడుగుతుంది. అది పూర్తి చేయాల్సి ఉంటుంది.
అది పూర్తయిన తరువాత మీ జీమెయిల్ ఐడీతో అనుసంధానమై ఉన్న అన్ని ఖాతాలు, వెబ్‌సైట్ల వివరాలు కనిపిస్తాయి. అందులో ఏయే వెబ్‌సైట్ల నుంచి మీ జీమెయిల్‌ను తొలగించాలనుకుంటున్నారో వాటిని డిలీట్ చేస్తే సరిపోతుంది. ఈ విధానంలో మూడు స్టెప్‌లు ఉంటాయి. వెబ్‌సైట్ సూచనలకు అనుగుణంగా సమాచారం ఇస్తే ఆయా వెబ్‌సైట్ల నుంచి మీ వివరాలను తొలగించేయొచ్చు.