• తాజా వార్తలు

డెడ్ అయిన కంప్యూటర్‌ని తిరిగి పని చేయించడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

కండీషన్‌లో ఉన్న మీ కంప్యూటర్ సడెన్‌గా పనిచేయటం మానేసిందా? కనీసం పవర్ ఆన్ కావటం లేదా? మీ కంప్యూటర్ డెడ్ అవటానికి గల ప్రధాన కారణం సీపీయూలోని కొన్ని విభాగాల్లో సమస్య కావచ్చు. ఎస్ఎమ్‌పీఎస్, ర్యామ్, అవుట్‌పుట్ కనెక్టర్, కరప్ట్ అయిన ఆపరేటింగ్ సిస్టం, బయోస్ కాన్ఫిగరేషన్ మారిపోవటం, ఏదైనా ఎక్స్‌టర్నల్ కార్డ్‌లో లోపం వీటిల్లో ఏదైనా లోపం ఉంటే కంప్యూటర్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ నేపథ్యంలో డెడ్ అయిన కంప్యూటర్‌ను ఫిక్స్ చేసేందుకు పలు ముఖ్యమైన సూచనలు మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ముందుగా మీ పీసీకి సంబంధించి పవర్ కార్డ్‌లను చెక్ చేయండి. వాటిలోకి పవర్ వస్తుందో రావటం లేదో నిర్థారించుకోండి. ఇందుకు మల్టీ మీటర్‌ను ఉపయోగించండి. సమస్య పవర్ కార్డ్‌లో ఉన్నట్లయితే పవర్ కార్డ్‌ను మారిస్తే సరిపోతుంది. కంప్యూటర్ వెనుక భాగంలోని వోల్టేజ్ సెట్టింగ్ స్విచ్‌ను ఓ సారి చెక్ చేయండి. మానిటర్‌ సరిగ్గా వర్క్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి.

ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్) అనేది పీసీలోని డేటాను ప్రాసెస్ చేస్తుంది. సాధారణంగా ర్యామ్‌లు రెండు రకాలు.. మొదటిది డీర్యామ్ (డైనకమిక్ ర్యాండ్ యాక్సెస్ మెమరీ), రెండవది ఎస్‌ర్యామ్ (స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ). ర్యామ్‌లను ఒకసారి వాటి స్థానాల నుంచి తొలిగించి రీఫిట్ చేయటం ద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది.

మీ కంప్యూటర్‌కు కనెక్ట్ అయి ఉన్న అన్ని యూఎస్బీ డివైస్‌లను ఒకసారి అన్‌ప్లగ్ చేసి చూడండి. సీ-ఎమ్ఓఎస్ బ్యాటరీని రీఫిట్ చేయటం ద్వారా బయోస్‌ను రీసెట్ చేయవచ్చు. ముందుగా బయోస్ బ్యాటరీని తొలగించండి. రెండు నిమిషాల తురువాత బయోస్ బ్యాటరీని మళ్లి తిరిగి ఇన్‌‍స్టాల్ చేయండి.

మీ పీసీలో ఏమైనా ఎక్స్‌టర్నల్ కార్డ్‌లు ఇన్‌స్టాల్ చేసి ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసి చూడండి.

జన రంజకమైన వార్తలు