• తాజా వార్తలు

కార్డు చెల్లింపులో కోల్పోయిన మొత్తాన్ని తిరిగిపొందడం ఎలా ? 

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

వినియోగదారులు ఒక్కోసారి షాపింగ్ సమయంలో కాని లేక డిన్నర్ సమయంలో కాని రాంగ్ లావాదేవీలు జరిపి అనేక చిక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. వీరు అటువంటి సమయంలో పోయిన డబ్బుని తిరిగి ఎలా పొందాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు కార్డు చెల్లింపుల ద్వారా వివాదాల్లో చిక్కుకుంటే ఛార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టడం ద్వారా కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. మీ కార్డు నుంచి మొత్తం కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది కాని అవతలి వారికి ఆ డబ్బు చేరదు. అయితే ఇలాంటి సంధర్భంలో కొన్ని రోజులకు ఆ అమౌంట్ మీ ఖాతాకు తిరిగి చేరుతుంది. 

ఒకవేళ అమౌంట్ క్రెడిట్ కాకపోతే మీరు బ్యాంకుకు ఛార్జ్ బ్యాక్ అభ్యర్థన పెట్టవచ్చు. ఛార్జ్ బ్యాక్ మెకానిజం అనేది ఒక వివాద పరిష్కార మార్గం. వినియోగదారుడు మోసపోయినా లేదా తిరస్కరణకు గురైనా ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు ఈ ఆప్సన్ ఉద్దేశించబడింది.

ఖాతాదారుడు ఛార్జ్ బ్యాక్ రిక్వెప్ట్ పెట్టేందుకు 45 నుంచి 120 రోజుల సమయం ఉంటుంది. ఇది బ్యాంకు నియమనిబంధనల మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం వినియోగదారుడు చెల్లింపులు చేసిన కార్డు జారీ చేసిన బ్యాంకుకు తమ పూర్తి వివరాలతో దరఖాస్తు నింపి బ్యాంకుకు సమర్పించాలి. ఛార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ కు గల కారణాలు, జరిపిన లావాదేవీలు సమాచారం వారికి అందించాలి. వినియోగదారులు ఇచ్చిన వివరాల ప్రకారం బ్యాంకులు లావాదేవీ జరిపిన విధానం వ్యాపారి తదితర వివరాలను కనుగొనే ప్రయత్నం చేస్తుంది. బ్యాంకులు వినియోగదారుల నుంచి ఏ ఖాతాలోకి ఎంత మొత్తం జమ అయిందనే వివరాలను తెలుసుకుంటారు.

ఆ లావాదేవీలు తెలుసుకున్న తరువాత వారికి మీరు పెట్టిన ఛార్జ్ రిక్వెస్ట్ ను వారికి బ్యాంకు పెడుతుంది. ఈ సమయంలో వారు దానిని అంగీకరించవచ్చు. తిరస్కరించవచ్చు. అంగీకరిస్తే ఆ మొత్తాన్ని ఛార్జ్ రిక్వెస్ట్ పెట్టిన వారి ఖాతాలోకి బదిలీ చేస్తుంది. అంగీకరించని పక్షంలో కారణాలను అడుగుతుంది. అయితే ఇచ్చిన సమయంలోగా ఛార్జ్ రిక్వెస్ట్ అందుకున్న వారు స్పందించకపోతే వారి ఖాతా నుంచి నేరుగా ఆ మొత్తాన్ని  కార్డు యజమాని ఖాతాలోకి జమచేస్తుంది.  లావాదేవీలు జరిగిన సమయంలో ఎవరి వద్దనైతే మిస్టేక్ ఉందో వారికి పెనాల్టీ విధించే అవకాశం ఉంది. కాగా ఛార్జ్ రిక్వెస్ట్ పెట్టే సమయంలో నియమ నిబంధనలు, షరతులను ఓ సారి పరిశీలించుకోవాల్సి ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు