నెట్‌వర్క్ సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడటం చాలా కష్టమవుతూ ఉంటుంది. అదే చాలా ముఖ్యమైన కాల్ అయితే మనకు ఎక్కడ లేని విసుగు వస్తుంది. సిగ్నల్స్ వీక్ అని మనకు ఎటువంటి అలర్ట్స్ లేకుండానే ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి. సిగ్నల్ వీక్ సమస్యను పరిష్కరించుకునేందుకు పలు సింపుల్ ట్రిక్స్ మీకోసం..
మీ ఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్ బాగుండాలంటే, మీ ఫోన్ బ్యాటరీ కూడా బలంగానే ఉండాలి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువుగా ఉన్న ఫోన్‌లతో పోలిస్తే తక్కువ ఛార్జింగ్ ఉన్న ఫోన్‌లలో నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉంటున్నట్లు కొన్ని సందర్భాల్లో రుజువైంది. నెట్‌వర్క్ సిగ్నల్‌కు ఫోన్ బ్యాటరీ చాలా అవసరం కాబట్టి, ఫోన్ బ్యాటరీని ఎప్పుటికప్పుడు ఫుల్ ఛార్జ్‌తో ఉంచుకోవటం మంచిది. ఫోన్ బ్యాటరీ ఆదా అవ్వాలంటే వై-ఫై, బ్లుటూత్, NFC తదితర కనెక్టువిటీ ఆప్షన్ లను అవసరంలేనపుడు స్విచాఫ్ చేసి ఉంచండి.
మీరు ఫోన్‌ను హోల్డ్ చేసి ఉంచే దానిబట్టి కూడా నెట్‌వర్క్ సిగ్నల్ అనేది మారుతుంటుంది. మీరు ఫోన్‌ను landscape positionలో పట్టుకుని ఉన్నట్లయితే సెల్ టవర్ నుంచి అందే సిగ్నల్స్‌ను మీ ఫోన్ యాంటెనా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. ఫోన్‌ను upright positionలో పట్టుకుని ఉండటం ద్వారా సిగ్నల్ బాగా అందే అవకాశం ఉంటుంది.
మీ ఫోన్ సిగ్నల్స్ బాగా వీక్‌గా ఉన్న సమయంలో మీరు 3జీ నుంచి 2జీకి మీ ఫోన్ సెట్టింగ్ మార్చుకోండి. దీని వల్ల మీ వాయిస్ సిగ్నల్స్ కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంటుంది. 2జీ అనేది అన్ని చోట్ల పాతుకుపోయి ఉంటుంది. అయితే 3జీ మాత్రం కొన్ని చోట్ల మాత్రమే వస్తూ ఉంటుంది. దీని వల్ల సిగ్నల్స్ ప్రాబ్లం వస్తుంది.
సిగ్నల్ బూస్టర్ పెట్టుకోవడం వల్ల సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో మీకు మరింతగా సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది.వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవటం ద్వారా నెట్‌వర్క్ సిగ్నల్ సమస్యలను నిరోధించవచ్చు. వై-ఫై తరహాలోనే Femtocells కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మీ ల్యాండ్‌లైన్ ఇంటర్నెట్‌ను సెల్యులార్ సిగ్నల్స్‌గా మార్చేసి, మీ ఫోన్‌కు బలమైన నెట్‌వర్క్‌ను ఆఫర్ చేస్తాయి.