ఏదైనా దేశానికి హాలిడే వెకేషన్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? కానీ వీసా లేదని వెనకడుగు వేస్తున్నారా? అయితే వీసా లేకుండానే వెళ్లగలిగే కొన్ని దేశాలు ఉన్నాయి! వీటిని `ట్రావెల్‌స్కోప్` వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వీసా లేకపోయినా కొన్ని దేశాల్లో ఉండే ప్రత్యేకమైన నిబంధనలు కూడా ఇందులో గమనించవచ్చు.
ఏం చేయాలి?
* ముందుగా ఈ ట్రావెల్‌స్కోప్ వెబ్‌సైట్‌ని బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి. హోం స్క్రీన్‌పై ప్రపంచ పటం కనిపిస్తుంది.
* మనం ఎక్కడి నుంచి బయలుదేరాలని భావిస్తున్నామో.. ఆ దేశాన్ని ఎంచుకోవాలి.
* పక్కనే కనిపించే Mode సెలెక్ట్ చేసుకుని.. డ్రాప్ డౌన్ మెనూలో Visa-free destinations మీద క్లిక్ చేయాలి.
* మనం ఎంచుకున్న దేశ పౌరులు.. ఎన్ని దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చో స్క్రీన్‌పై చూపుతుంది.
* మ్యాప్‌లోని మన దేశాన్ని సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయాలి. అక్కడి నుంచి ఏఏ దేశాలకు వెళ్లొచ్చో యానిమేటెడ్ గీతల ద్వారా తెలుసుకోవచ్చు.
* వీటితో పాటు ఆయా దేశాల్లోని ప్రత్యేక నిబంధనలు, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ వంటి కండీషన్స్ కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు నేరారోపణలు గల వ్యక్తులు పునరావాసం కోసం తీసుకోవాల్సిన అనుమతులు వంటివన్నీ వివరిస్తుంది.
* ఆకుపచ్చ రంగులో ఉన్న దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. గులాబీ రంగు- ప్రత్యేక నిబంధనలు, ఊదా రంగు- వీసా తప్పనిసరి, ఎరుపు- అడ్మిషన్ రెఫ్యూజ్డ్‌గా సూచిస్తుంది.
* వీటితో పాటు ఆ దేశంతో ఎంతమంది ప్రజలు నివసిస్తుంటారు, జీడీపీ వంటి వివరాలు కూడా అదనపు వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
* ఈ దేశాలకు కుటుంబసభ్యులతోనో, ఫ్రెండ్స్‌తోనే వెళ్లి చక్కగా ఎంజాయ్ చేసి రావొచ్చు.