• తాజా వార్తలు

సైలెంట్‌ మోడ్‌లో ఉన్న ఐఫోన్‌ని వెతికి పట్టుకోవడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

ఆపిల్ కంపెనీ ఐఫోన్ ని అందరూ చాలా ఇష్టపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఐఫోన్ కనపడకుంటే వారి భాదా చెప్పనవసరం లేదు. సోఫాలు, బెడ్లు, కిచెన్ లు, జాకెట్లు, ఫ్యాంటు జేబులు ఇలా ఎక్కడపడితే అక్కడ వెతుకుతుంటాం అయినా ఫోన్ ఒక్కోసారి కనపడదు. రింగ్ ఇద్దామంటే ఫోన్ సైలెంట్లో ఉంది కావున ఎంత రింగ్ ఇచ్చినా వినపడదు. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ ని ఎలా వెతకాలి అనే దానిపై కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం. ఓ లుక్కేయండి.

Find My iPhone
చాలా మంది ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్ కు దూరంగా ఉంటారు. అయితే ఈ ఫీచర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ ఐఫోన్ పోయిన పక్షంలో ఈ ఫీచర్ చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ ని రింగ్ చేయవచ్చు. అది సైలెంట్లో ఉన్నా లేక Do Not Disturb modeలో ఉన్నా చేయవచ్చు. అయితే ఇలా చేయడానికి తప్పనిసరిగా ఫోన్లో ఈ ఫీచర్ యాక్టివేట్ అయి ఉండాలి. అలాగే ఇంటర్నెట్ కనెక్టన్ ఉండాలి.

అది ఉంటే కింది స్టెప్స్ ఫాలో కండి
మీ మ్యాక్ సిస్టం నుండి www.icloud.comలోకి విజిట్ అవ్వండి. అకౌంట్లోకి లాగిన్ అవ్వండి

స్టెప్ 2
మీరు లాగిన్ అయిన తరువాత ఎడం పక్కన list of all the devices connected to that Apple account అనే ఆప్సన్ ఉంటుంది. అందులోకెళ్లి మీరు మీ ఐఫోన ని సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3
అక్కడ కనిపించే 3D representation మ్యాప్ ద్వారా ఫోన్ లోకేషన్ ని సెలక్ట్ చేసుకోవచ్చు. కింద కనిపించే స్క్రీన్ లో Play Soundని క్లిక్ చేయండి

స్టెప్ 4
మీ ఫోన్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే మీ ఫోన్ పెద్ద సౌండుతో అరవడం స్టార్ట్ చేస్తుంది. అది ఎక్కడ నుంచి ఆ సౌండు వినిపిస్తుందో మీరు గమనించండి. ఫోన్ మీకు కనపడగానే దాని సౌండును ఆపేయండి.దీన్ని మీరు ఐప్యాడ్ ద్వారా కూడా చేయవచ్చు.  మ్యాక్ సిస్టంలో ఎలా అయితే చేసామో అలానే ఐప్యాడ్ లో కూడాచేయవచ్చు.
 

జన రంజకమైన వార్తలు