• తాజా వార్తలు

వాట్సప్‌లో మెసేజ్‌లు డిలీట్ అయ్యాయా, అయితే ఇలా తిరిగిపొందండి 

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

వాట్సప్ నుంచి ఈ మధ్యకాలంలో లాంచ్ అయిన బెస్ట్ ఫీచర్లలో 'Delete for Everyone' ఒకటి. ఈ ఫీచర్ ద్వారా పొరపాటున పంపిన మెసేజ్‌లను 7 నిమిషాలలోపు వెనక్కి తీసుకునే వీలుంటుంది. అయితే ఈ ఫీచర్‌ను సర్‌పాస్ చేసేలా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ హ్యాక్ డిలీట్ కాబడిన మెసేజ్‌లను తిరిగి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ట్రిక్ మీ ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే తప్పనిసరిగా మీ వాట్సప్ అకౌంట్ లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ అయి ఉండాలి.

ముందుగా 'Notification History' అనే అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తరువాత మీ వాట్సాప్ మెసేజ్‌లను యాక్సిస్ చేసుకునేందుకు గాను యాప్‌కు పర్మిషన్‌ను గ్రాంట్ చేయవల్సి ఉంటుంది.

ఆ తరువాతి నుంచి, మీ వాట్సాప్ నెంబర్‌కు మెసేజ్‌ వచ్చిన ప్రతిసారీ ‘నోటిఫికేషన్ హిస్టరీ' యాప్ మీకు తెలియజేయటంతో పాటు ఆ మెసేజ్‌ను ‘లాగ్' ఫార్మాట్‌లో ఉంచుతుంది. లాగ్ బటన్ పై టాప్ చేసినట్లయితే సంబంధిత మెసేజ్‌లను క్యారెక్టర్ లిమిటేషన్స్‌తో చూపుతుంది.

ఒకవేళ సెండర్ ఆ మెసేజ్‌లను వాట్సాప్ నుంచి డిలీట్ చేసినట్లయితే నోటిఫికేషన్ హిస్టరీ యాప్, ఆ నోటిఫికేషన్‌ను కూడా మీకు చూపుతుంది.నోటిఫికేషన్ హిస్టరీ యాప్ ద్వారా డిలీట్ అయిన మెసేజ్‌ల వివరాలతో పాటు మేసేజ్ అందిన సమయం అలానే డిలీట్ కాబడిన సమయం కూడా తెలుసుకునే వీలుంటుంది.

వాట్సప్ ఈ మధ్య కాలంలో లాంచ్ చేసిన కీలక ఫీచర్లలో 'Delete for Everyone' ఒకటి. ఈ ఫీచర్ ద్వారా పొరపాటున పంపిన మెసేజ్‌లను వెనక్కితీసుకునే వీలుంటుంది. డిలీట్ చేయాలనుకుంటోన్న మెసేజ్ పై

కొద్ది సెకన్ల పాటు హోల్డ్ చేసిన ఉంచినట్లయితే డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే 'Delete For Me', 'Delete For Everyone' పేర్లతో రెండు ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. అందులో 'Delete For Everyone' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మెసేజ్ పూర్తిగా డిలీట్ కాబడుతుంది.

జన రంజకమైన వార్తలు