కంప్యూటర్ లో పని చేస్తుంటే కాల్స్ ఎత్తాలన్నా తీరిక ఉండదు. ఈ నేపథ్యంలోనే చాలా ముఖ్యమైన కాల్స్ మనం ఒక్కోసారి అందుకోలేకపోతుంటాం. అయితే ఇప్పుడు అలాంటి బెంగ లేకుండా మీరు ఫోన్ కాల్స్ కూడా కంప్యూటర్ నుంచే రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం థర్ట్‌పార్టీ సాఫ్ట్‌వేర్స్ ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ టూల్స్ ఉపయోగించుకుని ఆండ్రాయిడ్ ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను నేరుగా మీ కంప్యూటర్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. కంప్యూటర్‌తో పాటు ఓ మంచి హెడ్ ఫోన్ మైక్ ఉంటే చాలు.మరి ప్రాసెస్ ఎలాగో చూద్దాం.
ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో రిమోట్ ఫోన్ కాల్ అనే కూల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత యాప్‌ను ఫోన్‌లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. తరువాత మీ కంప్యూటర్‌లో కూడా కాల్‌సెంటర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. విజయవంతంగా పూర్తైన తరువాత లాంచ్ చేయాలి.
మీ మొబైల్ ఫోన్‌లోని రిమోట్ కాల్ యాప్ లాంచ్ అయిన వెంటనే డివైస్ ఐపీ అడ్రస్, పాస్‌వర్డ్ కనిపిస్తాయి. ఇప్పుడు కంప్యూటర్‌లోని కాల్ సెంటర్ యాప్‌లోకి వెళ్లి యాడ్ వై -ఫై డివైస్ ఆప్షన్ క్లిక్ చేసి ఐపీ అడ్రస్ ఎంటర్ చేయాలి. నెట్ వర్కుకు సంబంధించిన పాస్ వర్డును ఎంటర్ చేయాలి.
ఈ సింకింగ్ ప్రాసెస్ విజయవంతమైన వెంటనే మీ నెటవర్క్‌కు సంబంధించిన నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. ఈ కోడ్‌ను విండోస్ టూల్‌లో ఎంటర్ చేస్తే మీ ఫోన్ పీసీకి కనెక్ట్ అయిపోతుంది. మీ విండోస్ పీసీ కాల్ సెంటర్‌ను సెటప్ చేసుకోవటం ద్వారా నేరుగా మీ కంప్యూటర్ నుంచి ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను సెండ్ చేసుకునే వీలుంది. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా మీ ఫోన్ కాల్ లాగ్స్ పీసీలో సింక్ అయిపోతాయి.
ఈ యాప్ తో ఫోన్‌లోని అన్ని కాంటాక్ట్స్ కంఫ్యూటర్‌లో కనిపిస్తాయి. కాల్ లాగ్ సింక్ అవుతుంది. కాల్స్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, ఎస్‌ఎంఎస్‌లను చదవొచ్చు , పంపొచ్చు, కావాల్సిన కాంటక్ట్స్‌ను సెర్చ్ చేసుకోవచ్చు. ఆడియో సెట్టింగ్స్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. ఇన్ కమింగ్ కాల్స్ ఇంకా మేసేజ్‌లను సంబంధించి పాపప్స్ వస్తాయి. క్లిప్ బోర్డ్ నుంచే డయలింగ్ నెంబర్స్ పొందేందుకు ప్రత్యేకమైన హట్ కీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఇన్‌కమింగ్ కాల్స్‌ను యాక్సెప్ట్ చేసేందుకు హట్‌కీని సెటప్ చేసుకోవచ్చు.