ఎంత భద్రత ఉన్నా.. జీమెయిల్‌లో మనం పంపిన, మనకి వచ్చిన మెయిల్స్‌ను కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కూడా సలువుగా యాక్సెస్ చేసేస్తున్నాయి. దీంతో వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతోందని కొన్ని నివేదికల ద్వారా వెల్లడైంది. మనకు తెలియకుండానే జీమెయిల్‌లోకి చొరబడి వ్యక్తిగత, ముఖ్యమైన సమాచారమంతా గ్రహిస్తున్నాయి. గూగుల్ మాత్రం వేరొకరి చేతుల్లోకి మెయిల్స్‌లో ఉన్న సమాచారం వెళ్లదని స్పష్టంచేస్తోంది. ఈ నేపథ్యంలో జీమెయిల్‌లో ఉన్న సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే థర్డ్ పార్టీ యాప్స్.. మీ జీమెయిల్‌ను యాక్సెస్ చేయలేవు. అదెలానో చూద్దాం!
1. ముందుగా జీమెయిల్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
2. తర్వాత My Account ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3. స్క్రీన్ మీద.. గూగుల్ డేటాతో పాటు జీమెయిల్ ఇన్‌బాక్స్‌ను యాక్సెస్ చేసే థర్డ్ పార్టీ యాప్స్ కనిపిస్తాయి.
4. ఇందులో ఇన్‌బాక్స్‌ను యాక్సెస్ చేసే యాప్స్ తెలుసుకునేందుకు.. సెర్చ్‌బార్‌లో Gmail అని టైప్ చేయాలి.
5. జీమెయిల్ ఇన్‌బాక్స్‌ను యాక్సెస్ చేసే యాప్స్‌కి పక్కన Has access to Gmail అనే ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉంటుంది.
6. దీనిని మర్చుకోదలుచుకుంటే.. పక్కన దాని మీద క్లిక్ చేస్తే.. Remove Access ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక నుంచి మీ మెయిల్స్‌ను ఈ థర్డ్ పార్టీ యాక్సెస్ చేయలేవు.
గూగుల్ త్వరలోనే ఈ యాప్స్ పర్మిషన్స్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతోంది. ఎటువంటి సమాచారం యాప్స్‌కి యాక్సెస్ ఇవ్వాలనే అంశాలను ఇందులో ప్రవేశపెట్టబోతోంది.