ఆండ్రాయిడ్ నోటిఫికేషన్లు కంప్యూటర్‌లోనే చూసి, వాటికి కంప్యూటర్ నుంచే సమాధానం పంపింతే ఫోన్‌తో అవసరమే ఉండదు కదా! ప్రస్తుతం ఈ సర్వీసును అందిస్తోంది Crono అనే యాప్. ఇది ఆండ్రాయిడ్ ఫోన్‌కి మిర్రర్‌లా పని చేస్తుంది. పీసీని కంప్యూటర్‌తో సింక్రనైజ్ చేసేందుకు క్రోనో ఎక్స్‌టెన్షన్‌ని వెబ్ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్‌ని సపోర్ట్ చేస్తుంది. ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన సమయంలో.. పాప్ అప్ మెసేజ్ వస్తుంది. సో అప్పటికప్పుడు మెసేజ్‌కి రిప్లై ఇవ్వొచ్చు.. లేదా తర్వాత యాక్సెస్ చేసుకోవచ్చు. డేటా సురక్షితంగా ఉంచేందుకు, మరింత రక్షణ కల్పించేందుకు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్ట్రిప్షన్ ఉపయోగిస్తుంది.
నోటిఫికేషన్లు చూడటం ఎలా?
* క్రోనో ఎక్స్‌టెన్షన్‌ని బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* తర్వాత బ్రౌజర్ టూల్‌బార్‌లోని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
* ఇది క్రోనో వెబ్ పేజీని ఓపెన్ చేస్తుంది. వాట్సాప్‌వెబ్ మాదిరిగా QR codeని స్కాన్ చేయాలి.
* నోటిఫికేషన్లు సింక్రనైజ్ చేసుకునేందుకు నోటిఫికేషన్ యాక్సెస్, ముఖ్యమైన ఈవెంట్లకు సంబంధించి నోటిఫికేషన్ల కోసం కేలండర్‌కు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకునేందుకు కెమెరా యాప్‌కు పర్మిషన్ ఇవ్వాలి.
ఎలా పనిచేస్తుంది
ఫోన్‌లోని కెమెరా సాయంతో వెబ్ బ్రౌజర్‌లోని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. ఇది నోటిఫికేషన్లు సింక్రనైజ్ చేస్తుంది. క్రోనో వెబ్‌తో కనెక్ట్ అయితే.. పలు ఆప్షన్‌లతో కూడిన స్క్రీన్ వస్తుంది. కనెక్ట్ టు క్రోనో ఆప్షన్‌ని డిజేబుల్ చేసుకోవడం ద్వారా.. క్రోనో వెబ్ నుంచి ఎప్పుడైనా బయటికి రావొచ్చు. ఇక్కడి నుంచే కాల్ చేసుకోవచ్చు, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వొచ్చు. ఫోన్‌కు వచ్చే ప్రతి నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడొచ్చు. కుడివైపున.. ఆండ్రాయిడ్ డివైజ్ పేరుతో పాటు.. బ్యాటరీ లెవెల్‌ను కూడా చూపుతుంది. యాప్స్‌కి సంబంధించిన అలర్ట్స్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫైల్స్‌ని కూడా డివైజ్‌లోకి పంపుకోవచ్చు.
మరిన్ని ఆప్షన్లు..
కుడివైపున మరో మూడు ఆప్షన్లు ఉంటాయి. మనకు వచ్చిన నోటిఫికేషన్లు స్నూజ్ చేయడానికి స్నూజ్ నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్‌పై ఉన్న నోటిఫికేషన్లు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు హైడ్ నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా నోటిఫికేషన్ సమాచారం అస్పష్టంగా కనిపిస్తుంది. థీమ్స్ మార్చుకునేందుకు ఆప్షన్ ఆనే ఆప్షన్ ఉంటుంది.