ఫోన్ స్క్రీన్‌పై ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని అప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసేందుకు పవర్ బటన్‌తో పాటు వాల్యూమ్ డౌన్ బటన్‌ను ఉపయోగిస్తాం! కొత్త ఓఎస్ పీలో.. పవర్ బటన్‌లోనే స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉండబోతోంది. శామ్‌సంగ్ మొబైల్స్‌లో అరచేతిని స్క్రీన్‌పై ఒకసారి స్వైప్ చేస్తే చాలు. ఇలానే మిగిలిన ఫోన్లలోనూ గెశ్చర్లు, క్విక్ సెట్టింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎన్ని ఉన్నా.. స్క్రీన్ షాట్ తీసేందుకు అందరూ ఫాలో అయ్యేది మాత్రం పవర్ బటన్+వాల్యూమ్ డౌన్ బటన్ పద్ధతినే! ఎక్కువసార్లు వీటిని ఉపయోగిస్తే.. బటన్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. పవర్ బటన్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా స్క్రీన్ షాట్ తీసుకునే పద్ధతులు ఉన్నాయి.
QUICK ACCESS KEY
చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్‌షాట్‌ని త్వరగా తీసుకునేందుకు క్విక్ యాక్సెస్ కీ ఆప్షన్ అందుబాటులో ఉంది. నోటిఫికేషన్ సెట్టింగ్స్‌లో ఉండే స్క్రీన్ షాట్ ఆప్షన్‌ని ట్యాప్ చేస్తే.. స్క్రీన్‌ని స్క్రీన్ షాట్ తీస్తుంది.
Step 1: స‌్క్రీన్‌లో ఏ భాగాన్ని ఫొటో తీయాలనుకుంటున్నామో ఎంచుకోవాలి.
Step 2: నోటిఫికేషన్ పేనల్‌ని కిందకు స్వైప్ చేయాలి. ఇందులో క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో స్క్రీన్‌షాట్ ఆప్షన్ ట్యాప్ చేయాలి.
GESTURES
ఈ స్క్రీన్ షాట్ ఆప్షన్‌తో పాటు కొన్ని స్మార్ట్‌ఫోన్లలో గెశ్చర్ల ద్వారా స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్లు ఉన్నాయి. శామ్‌సంగ్ ఫోన్లలో.. మాత్రమే ఇందుకోసం ఒక ఆప్షన్ ఉంది. ఫోన్‌పై కుడి వైపు నుంచి ఎడమవైపునకు గానీ, ఎడమ నుంచి కుడి వైపునకు గానీ అరచేతిని కదిలిస్తే.. స్క్రీన్‌షాట్ తీసే గెశ్చర్ ఉంది. ఇందుకోసం device Settings > Motions and gestures > Enable Palm Swipe ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. హువాయ్ స్మార్ట్‌ఫోన్లలో.. Knuckle గెశ్చర్ ఉంది. అంటే మూడు సార్లు స్క్రీన్‌పై వేలి మెటికల(వేలితో డోర్ కొట్టినట్టు)తో కొట్టి స్క్రీన్‌షాట్ తీయవచ్చు. దీనిని సెట్టింగ్స్ ఆప్షన్‌లో స్మార్ట్ అసిస్టెంట్‌లోని Motion control settings నుంచి ఎనేబుల్ చేసుకోవాలి. వన్ ప్లస్, రెడ్‌మీ ఫోన్లలో మూడు వేళ్లతో స్క్రీన్‌పై స్వైప్ చేసే ఆప్షన్ ఉంది.
GOOGLE ASSISTANT
స్మార్ట్‌ఫోన్లలో ఉండే గూగుల్ అసిస్టెంట్ సాయంతోనూ స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. దాదాపు అన్ని ఫోన్లలో ఉంటుంది కనుక మెరుగ్గానే పనిచేస్తుంది. ఇందులోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ ద్వారా స్క్రీన్ షాట్ తీస్తే.. అవి ఫోన్‌లో సేవ్ చేసుకోలేం. అంతేగాక వీటిని ఎవరికైనా పంపే ముందు మార్పులు, చేర్పులు చేయలేం. వీటన్నింటికీ ఓకే అనుకుంటే.. గూగుల్ అసిస్టెంట్‌ని ఓపెన్ చేసి.. షేర్ స్క్రీన్‌షాట్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. తర్వాత దీనిని ఎవరికి పంపించాలనే ఆప్షన్ వస్తుంది. ఇందులో కాంటాక్ట్‌ని సెలక్ట్ చేసుకుంటే వారికి స్క్రీన్‌షాట్ వెళుతుంది.
THIRD-PARTY APPS
Screenshot Assistant: స్క్రీన్‌షాట్ తీసేందుకు కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ సాయంతో.. హోమ్ బటన్‌పై కొద్ది సేపు వేలితో నొక్కి ఉంచితే స్క్రీన్‌షాట్ తీయచ్చు. హోమ్ బటన్ నొక్కితే గూగుల్ అసిస్టెంట్ వస్తుంది కదా! స్క్రీన్‌షాట్ ఎలా వస్తుందనే సందేహం రావచ్చు. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే.. గూగుల్ అసిస్టెంట్ పనిచేయదు. గూగుల్ అసిస్టెంట్ లేకపోయినా ఫర్వాలేదు అనుకుంటే.. యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే.. గూగుల్‌లో అసిస్టెంట్ యాప్‌కి బదులు.. స్క్రీన్‌షాట్ అసిస్టెంట్‌కి సెట్టింగ్స్ మార్చుకోవాలి.
Screenshot Touch: గూగుల్ అసిస్టెంట్ ఫోన్‌లో ఉపయోగించుకోవాలని భావిస్తే.. మరో యాప్ కూడా ప్లేస్టోర్‌లో ఉంది. అదే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని స్టార్ట్ కేప్చర్ మానిటరింగ్ సర్వీస్ బటన్‌ని ట్యాప్ చేసుకుంటే స్క్రీన్‌పై.. ఒక ఫ్లోటింగ్ బటన్ వస్తుంది. దీనిని ట్యాప్ చేస్తే.. పలు ఆప్షన్లు కనిపిస్తుంటాయి. అందులో స్క్రీన్‌షాట్ ఆప్షన్ కూడా ఒకటి. దీనిని సెలక్ట్ చేసుకుంటే సులువుగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫోన్‌ను షేక్ చేసి కూడా స్క్రీన్‌షాట్లు తీసే వెసులుబాటు కూడా ఉంది. వీటితో పాటు.. స్క్రీన్‌ని రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇతరులు ఎవరైనా ఫోన్ తీసుకున్నప్పుడు వాళ్లు ఏం చేశారో తెలుసుకునేందుకు ఈ స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది.