వాట్సాప్ తొలిసారి Last Seen ఫీచర్ ప్రవేశపెట్టిన సమయంలో భిన్న వాదనలు వినిపించాయి. ఇది వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తుందని కొందరు.. అటువంటిదేమీ ఉండదని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో Last Seen అనేది కనిపించకుండా సెట్టింగ్స్‌లో మార్పులు చేసింది వాట్సాప్. ఇదే ఆప్షన్‌ని ఫేస్‌బుక్ మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం Last Seen ఆప్షన్.. Truecaller యాప్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల కొన్ని వ్యక్తిగత సమస్యలు వస్తున్నాయి. మరి దీనిని ఎలా హైడ్ చేయాలో తెలుసుకుందాం!
సెర్చ్ చేయడం ఇక కష్టం
మనకి తెలియని నంబర్ల నుంచి ఫోన్ వచ్చిన సమయంలో.. ఆ నంబర్ ఎవరిదో ముందుగా తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఉపయోగించే యాప్ Truecaller. ప్రస్తుతం ఎవరిదైనా నంబర్ తెలిస్తే చాలు సెర్చ్ ఆప్షన్ ద్వారా.. ప్రొఫైల్(పేరు, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్)ను సులువుగా తెలుసుకోవచ్చు. దీంతో వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతోందనే చర్చ ఎక్కువవుతోంది. దీనికి కూడా Truecaller చెక్ పెట్టబోతోంది. ఇప్పుడు ఎవరివైనా వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ Last Seen ఎనేబుల్ అయి ఉన్నంత వరకూ లేదా మనం యాప్ ఓపెన్ చేయనంత వరకూ లాస్ట్ సీన్‌ని చూడలేరు.
ఏం చేయాలంటే..
* ముందుగా Truecaller యాప్‌ని ఓపెన్ చేసి.. ఎడమ వైపు ఉన్న Menu మీద క్లిక్ చేయాలి.
* ఇప్పుడు settings ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
* తర్వాత ఓపెన్ అయ్యే మెనూలో General ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
* ఇందులో Availability అనే ఆప్షన్ ముందుగా ఎనేబుల్ అయి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేస్తే డిజేబుల్ అవుతుంది. దీనివల్ల లాస్ట్‌సీన్ కనిపించకపోవడంతో పాటు మనం ఆన్‌లైన్‌లో ఉన్నామనే విషయం కూడా తెలియదు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఈ ఆప్షన్ ఆన్ చేసి ఉన్న సమయంలో ఆండ్రాయిడ్ యూజర్ల లాస్ట్‌సీన్ టైమ్‌ని ఐవోఎస్ యూజర్లు తెలుసుకోవచ్చు, కానీ ఐవోఎస్ యూజర్ల లాస్ట్‌సీన్‌ని మాత్రం ఆండ్రాయిడ్ యూజర్లు తెలుసుకోలేరు.
థీమ్స్ కలర్స్ మార్చేందుకు
* ముందుగా Truecaller యాప్‌ని ఓపెన్ చేసి.. ఎడమ వైపు ఉన్న Menu మీద క్లిక్ చేయాలి.
* ఇప్పుడు settings ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
* Appearance ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
* Themes సెలక్ట్ చేసుకోవాలి.
* ఇందులో కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. వీటిలో ఏదో ఒకదానికి ఎంచుకోవాలి.