• తాజా వార్తలు

డ్యామేజీ అయిన ఫోన్ నుంచి డేటాను రక్షించుకోవడం ఎలా ? 

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ క్రింద పడి పూర్తిగా పగిలిపోయిందా..? స్క్రీన్ పై పగుళ్లు ఏర్పడి టచ్ రెస్పాన్స్ ఏ మాత్రం స్పందించటం లేదా..? మరి ఇలాంటి సందర్భాల్లో లాక్ కాబడి ఉన్న మీ ఫోన్‌ను ఎలా అన్‌లాక్ చేస్తారు..? ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా ఫోన్‌ను అన్‌లాక్ చేయవల్సిందే.ఇలాంటి పరిస్దితుల్లో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు కొన్ని ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక ప్రొసీజర్‌ను మీరు అనుసరించటం ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.


ముందుగా "Android Control Program" అనే సాప్ట్‌వేర్‌ను ఇంటర్నెట్ నుంచి మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని install చేసుకోండి. ఇప్పుడు మీ ధ్వంసమైన ఫోన్ ను కంప్యూటర్ కు USB data cable ద్వారా కనెక్ట్ చేయండి. తద్వారా ఆండ్రాయిడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ మీ ఫోన్‌కు సంబంధించి యాక్సిస్‌ను ఎనేబుల్ చేసి మౌస్ అలానే కీబోర్డ్ ద్వారా ఆపరేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కీబోర్డ్ సహాయంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకుని డేటా మొత్తాన్ని వేరొక డివైస్‌లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

రెండో ట్రిక్
ముందుగా మీ కంప్యూటర్ నుంచి Android Device Manager వెబ్ సైట్ లోకి వెళ్లండి. ధ్వంసమైన మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ అకౌంట్ అలానే GPS ఫీచర్లు ఎనేబుల్ చేసి ఉన్నట్లయితే ఆ అకౌంట్‌లోకి లాగినై స్కాన్ చేయండి. మీ డివైస్ కనెక్ట్ అయిన వెంటనే ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ పేజీలో Ring, Lock, Erase ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో లాక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్పటికే, మీ ఫోన్ లాక్ అయి ఉంటుంది కాబట్టి వ్యతిరేకంగా అన్‌లాక్ అవుతంది.

మూడో ట్రిక్ 
Vysor అనే క్రోమ్ అప్లికేషన్‌ను ఉపయోగించుకుని కంప్యూటర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా యూఎస్బీ కనెక్టువిటీ సహాయంతో మీ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయవల్సి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు