• తాజా వార్తలు

మీ ల్యాపీకి వైఫై హాట్‌స్పాట్ కనెక్ట్ అవ్వడం ఎలా ? సింపుల్ గైడ్ మీ కోసం 

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

ఈ రోజుల్లో చాలామంది వైఫై వాడుతుంటారు. ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడాలనుకుంటే అదే సరైన పద్దతి. అందుకే అనోక చోట్ల కంపెనీలు వైఫై ఆఫర్ చేస్తున్నాయి. ఈ వైఫైతో ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ అయి ఇంటర్నెట్‌ని వాడుకోవచ్చు. అయితే వైఫై కొంతమందికి రాకపోవచ్చు. వారి ల్యాప్ టాప్ కు ఆ ఆప్సన్ ఉండకపోవచ్చు. మరి అటువంటి సంధర్భంలొ ఏమి చేయాలి. ఇంటర్నెట్‌కు ఎలా కనెక్ట్ కావాలి.  అనేది తెలియదు. ఇందుకోసం మీరు వైఫై హాట్ స్పాట్  ఉపయోగించవచ్చు. దానిద్వారా మీరు మీ ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వొచ్చు. మరి ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసుకుందాం.    

ముందుగా మీరు కనెక్టిఫై డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవాలి. అది ఇన్ స్టాల్ కాగానే మీ కంప్యూటర్ ని రీ స్టార్ట్ చేయండి.

రీ స్టార్ట్ అయిన తరువాత నెట్ కనెక్ట్ ఎక్కడ ఉందో చెక్ చేయండి. అది కనెక్టివిటీ హట్ స్పాట్ మీద రన్ అవుతుందా లేదా చెక్ చేయండి.మీరు రెండు ట్యాబ్ లు గమనించాలి. సెట్టింగ్స్ అండ్ క్లయింట్స్, అక్కడే క్రియేట్ వైఫై హాట్ స్పాట్ అని వస్తుంది.

ఇంటర్నెట్ షేర్ లో డ్రాప్ మెనూని ఓ సారి చూడండి. అక్కడ మీకు వైర్ డ్ కనెక్షన్ లేక వైర్ లెస్ కనెక్షన్ అని అడుగుతుంది. మీరు కరెక్ట్ దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాలు.

అక్కడ మీకు కొన్ని ఆప్సన్స్ కనిపిస్తాయి. మీరు వైఫై పాస్ వర్డ్ యాడ్ చేసి స్టార్ట్ హాట్ స్పాట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయినట్లే వైఫై నెట్‌వర్క్ మాదిరిగా కనెక్టివిటీ ఉంటుంది, దానికి పాస్‌వర్డ్ ఇస్తే చాలు.

అయితే కనెక్టిపై అనేది పెయిడ్ యాప్. మీరు ఫ్రీ వర్షన్ లో అంటే ట్రయిల్ వర్సన్ లో వైఫై హాట్ స్పాట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అతి ప్రతి 30 నిమిషాలకు ఆగిపోతుంది. మీరు దీన్ని కొనుగోలు చేయండి అని అడుగుతూ ఉంటుంది.దీని ధర 25 డాలర్లు వరకు ఉంటుంది. పుల్ లైసెన్స్ తో 40 డాలర్ల వరకు ఉంటుంది. ఇది అన్ లిమిటెడ్ 3జీ ,4జీకి వాడుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు