బ్రౌజర్ క్లిక్ చేయగానే నీలం, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో గూగుల్ లోగో కనిపిస్తూ ఉంటుంది. ఈ లోగ్ చూసీచూసీ బోరు కొట్టేసే ఉంటుంది. దీని స్థానంలో మీ పేరు, కంపెనీ పేరు వస్తే ఎలా ఉంటుంది? ఇదెలా సాధ్యం అని అనుకోవద్దు. మీ పేరును గూగుల్ డూడుల్‌గా పెట్టుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకోసం రెండు సులువైన పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
Goglogo వెబ్‌సైట్ ద్వారా
కేవలం రెండే రెండు సులువైన స్టెప్స్‌తో మన సెర్చ్ ఇంజిన్‌ను మనమే డిజైన్ చేసుకునేందుకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. ఈ వెబ్ పేజీని బుక్‌మార్క్ చేసుకుని గూగుల్‌కి బదులుగా దీనినే డిఫాల్ట్ హోమ్‌పేజీగానూ సెట్ చేసుకోవచ్చు.
ఎలా చేయాలంటే..
* Goglogo వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
* మొదటి బాక్సులో గూగుల్ స్థానంలో ఏ పేరు రావాలని అనుకుంటున్నామో ఆ పేరు టైప్ చేయాలి.
* తర్వాత చాలా రకాల ఫాంట్ స్టైల్స్ స్క్రీన్‌పై కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే ఒక సెర్చ్ బార్‌తో.. మనం ఇచ్చిన పేరుతో వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది.
* ఒక తాత్కాలికమైన పరిష్కారం కోసం వెతికే వారికి ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. ఈ వెబ్‌పేజీ కూడా అంత ఆకర్షణీయంగా ఉండదు.
ADDON/EXTENSION ద్వారా..
యాడాన్స్ లేదా ఎక్స్‌టెన్షన్స్‌ని ఉపయోగించి గూగుల్ డూడుల్‌లో మరింత మెరుగ్గా మార్పులు చేయవచ్చు. ఇందు కోసంstylus అనే extension అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గూగుల్ లోగో స్థానంలో మనకు నచ్చిన పేరు రాయవచ్చు.
* ఫైర్‌ఫాక్స్‌లో Stylusని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* Add to Firefox buttonని క్లిక్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* గూగుల్ హోమ్‌పేజీలో కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి.
* Stylus ఐకాన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత పాప్ అప్ మెనూలో Find Styles ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ Styles ఏమిటి.. ఎందుకు?
గూగుల్ హోమ్ పేజీ లుక్‌ను మార్చేందుకు అవసరమైన థీమ్స్ ఇందులో ఉంటాయి. సుమారు 400కు పైగా థీమ్స్ రూపొందించారు. వీటిలో ఏదో ఒక థీమ్ ఎంచుకోవాలి. గూగుల్ లోగో స్థానంలో మనకు నచ్చిన పేరు రావాలంటే.. సీఎస్ఎస్ ఫైల్‌ని ఎడిట్ చేయాలి.
* హోమ్‌పేజీ కుడి వైపున థీమ్ నేమ్ పక్కనే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి.
* మరో విండోలో పేజీకి సంబంధించిన కోడ్ ఓపెన్ అవుతుంది.
* CTRL+F క్లిక్ చేస్తే.. ఒక ఫైండ్ ట్యాబ్ తెరుచుకుంటుంది.
* ఇందులో hplogo అని టైప్ చేయాలి. దీంతో ఆ కీవర్డ్‌తో ఉన్న ట్యాగ్స్ పసుపు రంగులో కనిపిస్తుంటాయి.
* వీటిలో ఇమేజ్ లింక్ గల URL మీద క్లిక్ చేయాలి.
* మన పేరు, కంపెనీ పేరు ఇచ్చేందుకు Festicide అనే టూల్‌ని ఉపయోగించాలి. కింద ఉన్న టెక్ట్స్ బాక్సులో పేరు రాయాలి.
* తర్వాత.. డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే కొత్త లోగో హార్డ్ డ్రైవ్‌లో సేవ్ అవుతుంది.
* దీనిని Imgur అనే ఇమేజ్ షేరింగ్ సైట్ ద్వారా అప్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఈ ఇమేజ్ లింక్‌ని కాపీ చేయాలి. కోడ్ ఉన్న ట్యాబ్‌లోకి వెళ్లాలి. ఇక్కడ ఇమేజ్ ఉన్న లింక్‌లో ఈ కొత్త ఇమేజ్ అడ్రస్ లింక్ పేస్ట్ చేయాలి.
* ఎడమ వైపు బాక్సులో సేవ్ మీద క్లిక్ చేయాలి.
* ఇప్పుడు బ్రౌజర్ హోమ్ పేజ్‌లో గూగుల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే.. మనం రాసిన పేరు, లోగోతో ఉన్న గూగుల్ పేజీ కనిపిస్తుంది. ఇందులో సెర్చ్ చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
బ్యాగ్రౌండ్ మార్చుకోవాలంటే
Stylusలో ఎన్నో రకాల థీమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇక మనకు నచ్చినట్లుగా లోగోలు తయారుచేసుకునేందుకు Festicides ఉపయోగపడతాయి. ఈ రెండింటినీ ఉపయోగించి సరికొత్త గూగుల్ హోమ్ పేజీని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ.. బ్యాగ్రౌండ్‌లో మనకు ఏ విధమైన కలర్ అవసరం లేదనుకున్నా, కొత్త బ్యాగ్రౌండ్ సెట్ చేసుకోవాలనుకున్నా.. సీఎస్ఎస్ కోడ్ ఓపెన్ చేసుకుని.. ఫైండ్ ట్యాబ్‌లో బ్యాగ్రౌండ్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇమేజ్ లింక్‌లో బ్యాగ్రౌండ్ వైట్ లేదా ఇతర ఇమేజ్ లింక్ ఇచ్చుకుంటే సరిపోతుంది.