• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఫోన్ పోయిందా, గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతికిపట్టేదాం ఇలా 

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

మనం జీవితంలో కీలక పాత్ర పోషిస్తోన్న ఫోన్ అనుకోకుండానో లేక అజాగ్రత్త కారణంగానో మన నుంచి దూరమైనట్లయితే భారీ మూల్యాన్నే చెల్లించుకోవల్సి ఉంటుంది. అయితే పోగొట్టుకున్న ఫోన్‌ను వెతికిపట్టుకునేందుకు అనేక టిప్స్ అండ్ ట్రిక్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో ఒకటి గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించుకుని పోగొట్టుకున్న ఫోన్ ను ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలసుకుందాం.

ఫైండ్ యువర్ ఫోన్ అనే ఫీచర్ను..
ఆండ్రాయిడ్ యూజర్లు ఫైండ్ యువర్ ఫోన్ అనే ఫీచర్ను ఉపయోగించుకోవటం ద్వారా యూజర్ తన ఫోన్‌కు సంబందించి అచూకీని ట్రాక్ చేసుకునే వీలుంటంది. ఇదే సమయంలో యాపిల్ యూజర్లు కూడా ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకుని తమ ఐఫోన్ అచూకీని తెలసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.

స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి....
ముందుగా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి www.maps.google.co.inలోకి వెళ్లాలి. ఆ తరువాత పోగట్టుకున్న ఫోన్‌కు సంబంధించిన గూగుల్ అకౌంట్‌తో గూగుల్ మ్యాప్స్‌లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత స్ర్కీన్ టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే త్రీ-హారిజెంటల్ బార్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.

యువర్ టైమ్‌లైన్ అనే ఆప్షన్....
ఇప్పుడు ఓపెన్ అయ్యే ఆప్షన్స్‌లో యువర్ టైమ్‌లైన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిని మీరు సెలక్ట్ చేసుకావాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే మెనూలో సంవత్సరం, నెల ఇంకా తేదీ వివరాలను ఎంటర్ చేసినట్లయితే డివైస్ ట్రాక్ లొకేషన్‌ను ట్రాక్ చేసుకునే వీలుటుంది. ఈ ప్రాసెస్ విజయవంతమవ్వాలంటే మిస్సింగ్‌కు గురైన మీ ఫోన్ లో లొకేషన్ ఆన్ అయి ఉండటంతో పాటు ఆ సమయంలో స్విచ్ ఆన్ అయి ఉండాలి.

జన రంజకమైన వార్తలు