• తాజా వార్తలు

2016 మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎ5, ఎ7లో ఆండ్రాయిడ్ 7.0 అప్‌డేట్ చేసుకోవడం ఇలా

  • - ఎలా? /
  • 7 సంవత్సరాల క్రితం /


గత ఏడాది రిలీజైన శాంసంగ్ గెలాక్సీ ఎ5, ఎ7 మోడల్ స్మార్ట్‌ఫోన్లకు ఆ సంస్థ ఓఎస్ అప్ డేట్ ఇచ్చింది. వాటికోసం ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్లు కొత్త అప్‌డేట్‌ను ఓవర్ ది ఎయిర్ రూపంలో పొందొచ్చు.

ఇలా చేయాలి
* యూజర్లు తొలుత సెట్టింగ్స్‌లోకి వెళ్లి అబౌట్ డివైస్ క్లిక్ చేయాలి
* అక్కడ డౌన్‌లోడ్ అప్‌డేట్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* దీంతో కొత్త అప్‌డేట్ డౌన్‌లోడ్ అవుతుంది.
* ఈ అప్‌డేట్ సైజ్ 970 ఎంబీ ఉంది.
* ఓఎస్ సైజు ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని వైఫై ద్వారా డౌన్‌లోడ్ చేసుకుంటే నయం. డాటా ఆదా అవుతుంది.

ఇక ఆ మూడు మరింత ఈజీ
కాగా కొత్త అప్‌డేట్ ద్వారా రానున్న ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్‌లో యూజర్లు మరిన్ని ఫీచర్లను పొందవచ్చు.
* నోటిఫికేషన్, క్విక్ సెట్టింగ్స్ బటన్లను మరింత సులభంగా వాడుకునేందుకు వీలుంటుంది.
* మల్టీ విండో మోడ్‌ను మరింత మెరుగ్గా తీర్చి దిద్దారు.
* యాప్స్ ఇన్‌స్టాలేషన్ కోసం డివైస్ స్టోరేజ్‌లో మరింత స్పేస్ ఉంటుంది.

జన రంజకమైన వార్తలు