• తాజా వార్తలు

టాటా స్కైని నెలరోజుల పాటు ఉచితంగా పొందడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

దిగ్గజ డైరెక్ట్- టు- హోమ్ (డీటీహెచ్) సర్వీస్ ప్రొవైడర్ టాటా స్కై సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది. యూజర్లకు బంపరాఫర్లను అందిస్తూ వస్తోంది. వేట్ డైరక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన టాటా స్కై యూజర్ల కోసం మరో అదిరిపోయే ఆఫర్ ను అందిస్తోంది. యాన్వుల్ ఫ్లెక్సి ప్లాన్ రూపంలో నెల రోజుల పాటు ఉచిత సేవలు అందిస్తోంది. ఈ ప్లాన్ ప్రకారం మీరు 12 నెలలకు డబ్బులు ఒకసారి చెల్లిస్తే.. 1 నెల బిల్లు మొత్తాన్ని కంపెనీ మీ అకౌంట్‌లో ఉచితంగా జమ చేస్తుంది. 

టాటా స్కై ఫ్లెక్సి యాన్వుల్ ప్లాన్ విషయానికి వస్తే యూజర్లు నెలవారీ బిల్లుకు 12 రెట్లు అధిక మొత్తాన్ని వారి అకౌంట్‌లో కలిగి ఉండాలి. అప్పుడు యూజర్లు ఈ ఫ్లెక్సి ప్లాన్ పొందొచ్చు. మీ నెలవారీ బిల్లు రూ.200 అనుకుంటే.. మీ అకౌంట్‌లో రూ.2,400 బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు టాటా స్కై యాన్వుల్ ఫ్లెక్సి ప్లాన్ సదుపాయాలు లభిస్తాయి. 

అలా కాకుండా మీరు మీ అకౌంట్‌లో రూ.2,400 బ్యాలెన్స్ కలిగి ఉంటే కంపెనీ మీ అకౌంట్‌లో రూ.200 జమచేస్తుంది. టాటా స్కై యూజర్లు వారి ప్లాన్లను ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా మార్చుకోవచ్చు. అయితే బ్యాలెన్స్ మాత్రం 12 నెలలకు పైనే ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు మీ ప్లాన్‌ను సవరించేటప్పుడు నెలవారీ బిల్లు రూ.300 అయితే.. అప్పుడు మీ అకౌంట్‌లో రూ.3,600 ఉండేటా చూసుకోవాలి. అప్పుడే యాన్వుల్ ఫ్లెక్సి ప్లాన్ ప్రయోజనాలు లభిస్తాయి. బోనస్ అమౌంట్ ప్లాన్ చివరి రోజున అకౌంట్లో జమవుతుంది.
 

జన రంజకమైన వార్తలు