ఒకప్పుడు గుర్తింపు కోసం ఒక్క రేషన్ కార్డునో, లేదా ఓటరు గుర్తింపు కార్డునో అడిగేవారు. ఇప్పుడు అనేక రకాల గుర్తింపు కార్డులు జీవితంతో భాగమయ్యాయి. డెబిట్ కార్డు నుంచి ఆధార్ కార్డు వరకూ వెంట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కార్డులు పోతే ఏం చేయాలో అర్ధం గాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లావాదేవీలు నడిపే డెబిట్ , క్రెడిట్ కార్డులు పోతే ఎక్కడ లేని ఆందోళన వచ్చేస్తోంది. అయితే మీరు కార్డు పోయిన వెంటనే దాన్ని బ్లాక్ చేస్తే మీరు చాలా సేఫ్ గా ఉండవచ్చు. మరి కార్డు బ్లాక్ చేయాలంటే ఏం చేయాలి. ఎవరిని సంప్రదించాలి అనే అంశాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
కస్టమర్ కేర్ కి కాల్
మీరు ఎటీమ్ కార్డులను పోగొట్టుకున్నట్లయితే వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేసి దాన్ని బ్లాక్ చేయించవచ్చు. ఎవరికైనా దొరికినా దాన్ని వాడకుండా వెంటనే బ్లాక్ చేసేందుకు ఇదొక ఉత్తమమైన మార్గం. గూగుల్ నుంచి మీరు టోల్ ఫ్రీ నంబర్ ని కనుక్కుని బ్యాంక్ నేమ్ చెప్పి మీరు బ్లాక్ చేయించుకోవచ్చు. అయితే మీరు కాల్ చేసే ముందు మీ అకౌంట్ కి సంబంధించిన కొన్ని వివరాలను దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. bank account number, last transaction details లాంటివి వారికి చెప్పాల్సి ఉంటుంది.
Using Netbanking
మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు కార్డు బ్లాక్ చేయవచ్చు. మీ పీసి నుండి కాని మీ స్మార్ట్ ఫోన్ నుండి కాని నెట్ బ్యాకింగ్ కి లాగిన్ అయి అక్కడ కనిపించే ‘Card’ or ‘Services’ లో కెళ్లి బ్లాక్ రిక్వెస్ట్ పెట్టవచ్చు.
Using SMS
చాలా బ్యాంకులు ఇప్పుడు SMS ద్వారా కార్డు బ్లాక్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. బ్యాంకు ఖాతాకు కలిగిఉన్న రిజిస్టర్ మొబైల్ ద్వారా యూజర్లు వారి బ్యాంకు టోల్ ఫ్రీ నంబరుకు కాని లేదా మరేదైనా ఇతర నంబరు కాని ఎసెమ్మెస్ రూపంలో పంపి మీ కార్డును బ్లాక్ చేయించుకోవచ్చు.
బ్యాంకును సంప్రదించడం ద్వారా
మీరు ఎప్పుడైనా మీ కార్డును పోగోట్టుకున్నట్లయితే మీ సమీపంలోని బ్యాంకుకు వెళ్లి మీరు మీ కార్డును బ్లాక్ చేయించుకోవచ్చు. బ్యాంకు పని వేళల్లో మీరు పోగోట్టుకున్న బ్యాంకు కార్డు కలిగిన బ్రాంచును సంప్రదించి కార్డును బ్లాక్ చేయమని కోరవచ్చు.