• తాజా వార్తలు

ఎస్‌బిఐ అకౌంట్ వివరాలు మరచిపోతే ఇలా ఓపెన్ చేయవచ్చు

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

డిజిటల్ టెక్నాలజీ ఊపందుకోవడంతో ఇప్పుడు అంతా తమ బ్యాంకు లావాదేవీలను ఆన్‌లైన్ ద్వారానే కొనసాగిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ బ్యాకింగ్ వాడేవారు ఒక్కోసారి తమ లాగిన్ వివరాలను మరచిపోయి ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఎస్‌బిఐ వినియోగదారులకి ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాగా ఖాతాదారుడు వరుసగా మూడుసార్లు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే నెట్ బ్యాకింగ్ ఖాతా లాక్ అయ్యే ప్రమాదం కూడా ఉండటంతో చాలా టెన్సన్ కు గురి అవుతుంటారు. అలాంటి వారికోసం ఎస్‌బిఐ పాస్‌వర్డ్‌ రీసెట్‌ చేసుకోవడం, ఎస్‌బీఐలాగిన్‌ పాస్‌వర్డ్‌ మార్చుకోవడం లాంటి ఆప్సన్లను అందించింది. మరి వీటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

మీరు ముందుగా Sbi అఫిషియల్ పేజీ https://www.onlinesbi.comలోకి లాగిన్ పేజీ ఓపెన్ చేయాలి.    

పేజీలో లాగిన్ అయిన తరువాత అక్కడ మీకు forget login password ఆప్సన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే కొన్ని వివరాలతో కూడిన విండో ప్రత్యక్షమవుతుంది.

అక్కడ మీ యూజర్‌ నేమ్, బ్యాంక్‌ ఖాతా సంఖ్య దేశం, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్‌ చేసిన మొబైల్‌ సంఖ్య, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చెయ్యాలి.వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ కి ఓటీపి వస్తుంది.

దాన్ని ఓటీపీలో ఎంటర్ చేస్తే మళ్లీ మీకు మూడు ఆప్సన్లతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది. ఏటీఎమ్‌ కార్డును ఉపయోగించి, ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, ఏటీఎమ్‌ కార్డు వివరాల్లేకుండా అనే ఆప్సన్లు ఉంటాయి.

దాన్ని ఓటీపీలో ఎంటర్ చేస్తే మళ్లీ మీకు మూడు ఆప్సన్లతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది. ఏటీఎమ్‌ కార్డును ఉపయోగించి, ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, ఏటీఎమ్‌ కార్డు వివరాల్లేకుండా అనే ఆప్సన్లు ఉంటాయి.

మరో ఆప్సన్ ఏటీఎం ద్వారా మీరు పాస్‌వర్డ్‌ ని సెట్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్నవివరాలను ఎంటర్ చేయాలి. అవన్నీ ఎంటర్ చేసిన తరువాత మీకు క్రియేట్ న్యూ పాస్‌వర్డ్‌ అనే ఆప్సన్ గల పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ కొత్త పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి మీ అకౌంట్ లాగిన్ కావచ్చు.

ఇక మూడో ఆప్సన్ సెలక్ట్ చేసుకుంటే మీకు రెండు ఆప్సన్లు కనిపిస్తాయి. బ్యాంకు దగ్గర రీసెట్ కాని లేకుంటే కొత్త పాస్‌వర్డ్‌ పోస్ట్ ద్వారా పంపమనే వివరాలు కనిపిస్తాయి.వాటిల్లో మీరు సెలక్ట్ చేసుకునే దాన్ని బట్టి వివరాలను అందిచాల్సి ఉంటుంది. పోస్టు ద్వారా మీరు వివరాలు కావాలనుకుంటే అడ్రస్ ఇచ్చి సబ్ మిట్ బటన్ నొక్కాలి. 10 రోజుల్లో మీరు ఇచ్చిన అడ్రస్ కి వారు కొత్త పాస్‌వర్డ్‌ తో కూడిన వివరాలను పోస్ట్ ద్వారా పంపిస్తారు.

జన రంజకమైన వార్తలు