• తాజా వార్తలు

మరో 9 నెలల్లో ఇండియాలో 50 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు

గత మూడేళ్లలో 20 కోట్ల నుంచి 40 కోట్లకు పెరిగిన యూజర్లు  

ఇండియాలో ఈ ఏడాది చివరి నాటికి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 50 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. సాక్షాత్తు ప్రభుత్వంలోని ఐటీ మంత్రిత్వ శాఖే ఈ మేరకు అంచనాలు వేస్తోంది. అదేసమయంలో దేశంలో ఎలక్ర్టానిక్స్ తయారీ రంగం కూడా ఫుల్ స్వింగ్ లోకి వస్తుందని చెబుతున్నారు. ఈ రంగంలోకి ఇప్పటికే రూ.1.28 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఐటీ శాఖ చెబుతోంది.

2014లో ఎలక్ట్రానిక్‌ తయారీ రంగంలో రూ.11,700 కోట్లు పెట్టుబడులు తరలిరాగా.. 2016 మార్చి 20 వరకు వరకు లెక్కిస్తే రూ.1,28,000 కోట్ల కంటే ఎక్కువనే పెట్టుబడులు వచ్చాయట. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారులు 50 కోట్లను మించిపోతుందన్నారు. కాబట్టి ఎలక్ట్రానిక్‌ రంగం కీలకంగా మారిందన్నారు. గత మూడేళ్లలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 20 కోట్ల నుంచి 40 కోట్లకు పెరిగిందట...2017  ప్రారంభం నాటికి 50 కోట్లకు చేరతుందని అనుకుంటున్నారు.

ఓ వైపు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పేరుతో విజృంభిస్తుండడం... పలు రాష్టాలు కూడా ఇంటర్నెట్ లింకేజికి ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ మాట నిజం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఫైబర్ నెట్ పేరుతో గ్రామాల్లో సైతం ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే దిశగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అది కూడా తక్కువ ధరకే ఇవ్వనుండడంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగనుండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే స్పీడు కొనసాగితే మరో పదేళ్లలో దేశమంతా ఇంటర్నెట్ మయం అవుతుందనిపిస్తోంది.

జన రంజకమైన వార్తలు