ఆధార్.. భారత్‌లో ప్రతి ఒక్క పౌరుడుకి తప్పక ఉండాల్సిన డాక్యుమెంట్ ఇది. ఉద్యోగాల్లో, బ్యాంకుల్లో, ప్రైవేటు, ప్రభుత్వ ఏ రంగాల్లోనైనా మన ఐడెంటిటీని గుర్తించేందుకు ఆధార్‌నే ప్రాదిపదికగా తీసుకుంటున్నారు. అయితే ఆధార్ తప్పనిసరి అనే అంశంపై చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఆధార్ తప్పని సరి అనడంతో విమర్శలు ఎదురయ్యాయి. ముఖ్యంగా గ్యాస్ లింక్ చేయడం, పిల్లను స్కూల్‌లో చేర్పించడం, బ్యాంకు ఖాతాలకు లింక్ చేయడం, పోస్ట్ ఖాతాలకు లింక్ చేయడంతో పాటు ప్రవేశ పరీక్షల్లో సైతం ఆధార్ కావాలని అడుగుతుండడంతో జనం బెంబెలెత్తారు. దీంతో దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకు రావాల్సిన అవసరం వచ్చింది.
ఈ ఆర్డినెన్స్‌తో ఏంటి ఉపయోగం
ఆధార్ తప్పనిసరి.. ఇన్నిరోజులూ ప్రభుత్వం చెబుతున్న మాట. అయితే సెల్‌ఫోన్ సిమ్ తీసుకోవడానికి కూడా ఆధార్ తప్పనిసరి అనడంతో తిప్పలు మొదలయ్యాయి. ఆధార్ లేని వాళ్లు ఇక సిమ్ వాడకూడదా అనే పరిస్థితి వచ్చింది. అయితే ఆధార్‌ను తప్పని సరి అని చెప్పిన సుప్రీం కోర్టు చివరికి ఈ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. దీని ప్రకారం ఆధార్ వినియోగం సరళత లభిస్తుంది. ఇది ప్రతిసారి తప్పనిసరి కాదు. అవసరమై చోట మాత్రమే ఆధార్‌ను తప్పనిసరిగా తీసుకోవడం ఈ ఆర్డినెన్స్‌లో ముఖ్యాంశం. దీని వల్ల ప్రైవేటు సంస్థలకు ఊరట లభించింది. ముఖ్యంగా టెలికాం రంగానికి ఇది ఉపయోగపడుతుంది.
ముఖ్యంశాలు
బ్యాంకులు, టెలికోస్ లాంటి ప్రైవేటు సంస్థలు నో యువర్ కస్టమర్ (కేవైసీ) తెలుసుకోవడం కోసం మాత్రమే ఆధార్‌ను ఉపయోగించొచ్చు. రెండు సార్లు వెరిఫికేషన్ కోసం గతంలో ఆధార్‌ను ఉపయోగించేవాళ్లు. అయితే యూఐడీఏఐ భద్రత ప్రమాణాలను అనుసరించి మాత్రమే ఆధార్‌ను అథంటికేషన్ కోసం ఉపయోగించుకోవాలి. చిన్న పిల్లలకు ఆధార్ తీసుకుంటే వాళ్ల ఆధార్ నంబర్‌ను మనం కాన్సిల్ చేసుకోవచ్చు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అనుసరించి కూడా కేవైసీని తీసుకోవాల్సి ఉంటుంది. యూఐడీఏఐ ఫండ్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికిఇ కూడా ఈ కొత్త అమెండ్‌మెంట్ ఉపయోగపడుతుంది.