• తాజా వార్తలు

ఢిల్లీ లో అందరూ టాక్స్ ఇన్స్పెక్టర్ లే

టాక్స్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలి? నోటిఫికేషన్ విడుదల అయినప్పుడు అప్లై చేసి పరీక్ష రాసి ఉత్తీర్ణులైతే మీకు టాక్స్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగం వస్తుంది. కానీ మన దేశ రాజధాని ఢిల్లీ లో ఇదంతా చేయనవసరం లేదు. అవ్వాలనుకుంటే ఎవరైనా టాక్స్ ఇన్ స్పెక్టర్ అయిపోవచ్చు. అదికూడా ఒక్క ఫోన్ క్లిక్ తో .జీతం ఎంతో తెలుసా? యాభై వేల రూపాయల వరకూ ఉంటుంది. అదేంటి ఢిల్లీ లో  ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత తేలికా? ఆశ్చర్య పోకండి. ఈ ఆర్టికల్ చదవండి.

పన్నుల కలెక్ట్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికీ, దానిలో పారదర్సకత తీసుకు రావడానికీ ఢిల్లీ ప్రభుత్వం ఒక సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. అదే DVAT BILL యాప్. ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మనీష్ సిసోడియా ఈ యాప్ ను విడుదల చేశారు. ఈ మొబైల్ అప్లికేషను ద్వారా ప్రభుత్వం పరిపాలన లో ప్రజలు కూడా పాలుపంచుకోవచ్చు. ఢిల్లీ రాష్ట్ర ట్రేడ్ అండ్ టాక్సెస్ డిపార్ట్ మెంట్ ఈ సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేసింది. “ఈ మొబైల్ యాప్ ద్వారా సాధారణ ప్రజలు కూడా టాక్స్ ఇన్ స్పెక్టర్ అవ్వచ్చు.సాధారణ ప్రజలు కూడా MLA, మంత్రి లేదా అధికారి గా మారే అవకాశాలను నేడు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. ఈ అవకాశాలను మేము పోదిగించ దలుచుకున్నాము.” అని ఉప ముఖ్య మంత్రి అన్నారు.  షాప్ లో ఖరీదు చేసిన బిల్ కానీ క్యాష్ మెమో కానీ మీ దగ్గర ఉంటే చాలు ఈ యాప్ ను మీరు ఉపయోగించుకోవచ్చు.కానీ మీ ఖరీదు చేసిన మొత్తం 100 రూపాయల కంటే తక్కువ గా ఉండకూడదు. మీకు అమ్మిన షాప్ యజమాని రిజిస్టర్డ్ డీలర్ అయి ఉండాలి. మీరు మీ మొబైల్ లో ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి.

మీ దగ్గర ఉన్న బిల్ ను లేదా క్యాష్ మెమో ను మొబైల్ లో ఫోటో తీసి ఆ స్నాప్ ను మీ మొబైల్ లో ఉన్న DVAT BILL యాప్ లో అప్ లోడ్ చేయాలి. మీరు అప్ లోడ్ చేసిన ప్రతి బిల్ కు ఒక యునిక్ ఐడి సృష్టించ బడుతుంది. అలా సృష్టించ బడిన బిల్లుల యొక్క యూనిక్ ఐడి లన్నింటికీ ప్రతి నెల 15 వ తేదీన లక్కీ డీప్ ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. లక్కీ డీప్ లో ఎంపికైన బిల్లులకు సుమారు 50,000 రూపాయల వరకూ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అదీ పన్నులు మినహాయించి.ఇది మీరు ఖరీదు చేసిన మొత్తానికి సుమారు 5 రెట్లు ఎక్కువ గా ఉంటుంది. కానీ మోటార్ సైకిల్ లూ, పెట్రోలియం ఉత్పత్తులు లాంటి వస్తువుల కొనుగోలు పై వర్తించదు.

ఈ విధానం లో వినియోగదారుడు డైరెక్ట్ గా బిల్లులను ప్రభుత్వానికి అప్ లోడ్ చేస్తున్నారు కాబట్టి డీలర్ లు మోసం చేసే అవకాశం దాదాపుగా ఉండదు. దీని వలన ప్రజలలో బాధ్యత తో పాటు డీలర్ లలో పారదర్సకత కూడా పెరుగుతుంది. మోసం చేసే డీలర్ లందరికీ ఇది హెచ్చరికే కదా?కానీ నిజాయితీ కలిగిన వారు దీనిని చూసి భయపడవలసిన అవసరం లేదు కదా? దీని ద్వారా పన్ను ఎగవేత దారులను సులభంగా గుర్తించవచ్చు. అంతేగాక అధికార వికేంద్రీకరణ అనేది VAT ఆఫీసుల నుండి ప్రజల వరకూ అతి సులభంగా చేరుతుంది.

 

జన రంజకమైన వార్తలు