ఇప్పటివరకూ 350 కి పైగా మొబైల్ ఫోన్ లను విజయవంతంగా పట్టుకున్న మొబైల్ రికవరీ సెల్ రాహుల్ ఈ మధ్యనే ఒక కొత్త ఖరీదైన మొబైల్ ఫోన్ కొన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ కొన్న నెల రోజులకే దాన్ని పోగొట్టుకున్నాడు. వెంటనే అలహాబాద్ లోని మొబైల్ రికవరీ సెల్ నందు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాడు.అతను కంప్లైంట్ ఇచ్చిన నెల లోపే అతని ఫోన్ అతని చేతికి వచ్చింది. ఇక రాహుల్ ఆనందానికి అవధులు లేవు. రాహుల్ ఒక్కడే కాదు అతనిలాంటి సుమారు 51 మందికి వారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను మొబైల్ రికవరీ సెల్ వారు తిరిగి అందజేశారు. వీరంతా తమ ఫోన్ లను తిరిగి పొండుతున్నందుకు చాలా సంతోషంగా ఉందనీ, తమ ఫోన్ లను తిరిగి దక్కించుకునేలా చేసిన మొబైల్ రికవరీ సెల్ కు ప్రత్యెక కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు నెలలలో ఈ మొబైల్ రికవరీ సెల్ కు 100 కి పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో సంబందిత డాక్యుమెంట్ లను పరిశీలించిన తర్వాత ఆ ఫోన్ ల యొక్క అసలైన యజమానులకు MRC వారు అందజేశారు. గత సంవత్సరం సుమారు 300 ఫోన్ లను అసలైన యజమానులకు మొబైల్ రికవరీ సెల్ వారు అందజేశారు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ తో కూడిన టీం వీటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. వీరు నిరంతరం వివిధ మార్గాలలో దొంగిలించబడిన మొబైల్ ల కోసం గాలిస్తూనే ఉంటారు. దీనిలో భాగంగా వీరు అవసరమైతే పక్క రాష్ట్రాలకు కూడా వెళ్లి వెతికి పట్టుకోస్తారు. ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ కేంద్రం గా పనిచేస్తున్న ఈ సంస్థ త్వరలోనే ఆ రాష్ట్రం లోని మిగతా ప్రాంతాలకు కూడా తమ సేవలను విస్తరించాలని భావిస్తుంది. ఈ మొబైల్ రికవరీ సెల్ రాష్ట్ర DGP ఆదేశాల మేరకు ఏర్పాటుచేయబడింది.కానీ ఇది ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఎందుకంటే ఈ రికవరీ సెల్ ఎలక్ట్రానిక్ నిఘా సహాయం తో పోయిన మొబైల్ లను రికవరీ చేస్తుంది. ఈ ఎలక్ట్రాని నిఘా కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకవేళ పోగుట్టుకున్న మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటె దానిని కనిపెట్టడం వీరివల్ల కాదు. ఎందుకంటే ప్రతీ మొబైల్ కు ఒక IMEI నెంబర్ ఉంటుంది. ఫోన్ ఎల్లపుడూ స్విచ్ అఫ్ లో ఉంటే దీనిని ఉపయోగించి కనిపెట్టడం కష్టం అయిపోతుంది. అంటే మీ ఫోన్ రికవరీ కావాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు దానిని ఉపయోగిస్తూ ఉండాలి. |