మన దేశం యొక్క సైనిక శక్తిని గురించి మీకేమైనా తెలుసా? ఒక్క క్లిక్ తో మన సైనిక సామర్థ్యాలను మన సైన్యం యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటే ఎలా ఉంటుంది. అయితే మీ కోసమే ఈ న్యూస్ , చదవండి. భారతసైన్యం డిజిటలైజేషన్ అయింది. సైనిక సిబ్బంది యొక్క సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేసే విధంగా క్లౌడ్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఆర్మీ క్లౌడ్ గా పిలుస్తున్న ఆ వ్యవస్థను కేంద్ర రక్షణశాఖామంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. తద్వారా డిజిటల్ ఆర్మీగా సైన్యాన్ని ఆధునీకరించారు. వాటి కార్యకలాపాలను నిర్వహించేందుకు, ఢిల్లీ లో సెంట్రల్ డేట్ కేంద్రాన్ని, నియర్ లైన్ డేట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటితో పాటు పర్యావరణ రక్షణ భవనం లో విపత్తు స్వాధీన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇకనుండి ఎవరైనా ఒక్క క్లిక్ తో ఆర్మీ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. |