ఫోన్ ప్రతి ఒక్కరికి అత్యవసర వస్తువు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అది మనతో లేకపోతే ఏదో వెలితి. ఇంతగా మనతో బంధం పెంచున్న ఫోన్‌లోనే మనం అన్ని దాచుకుంటాం. ఫోన్ ద్వానే అన్ని షేర్ చేసుకుంటాం. అలాంటి ఫోన్ మనకు దూరమైతే! అంటే ఎక్కడో జారిపడిపోతేనో! లేక ఎవరైనా దొంగిలిస్తేనో... మనం బాధ వర్ణనాతీతం. దీనికి కారణం మన వ్యక్తిగత సమాచారం ఈ ఫోన్‌లో నిక్షిప్తమై ఉండటమే. అవసరమైన నెంబర్లతో పాటు, ఫొటోలు, వీడియోలు ఇలా ఎన్నో గురుతులు ఫోన్‌లోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఫోన్ పాడైనా, పోయినా వాటిని మనం పోగొట్టుకోకూడదంటే కొన్ని చిట్కాలు పాటించాలి. కాంటాక్ట్స్ బ్యాక్అప్ ఫోన్‌లో మనకు అత్యంత ముఖ్యం నెంబర్లే. ఇవి కోల్పోతే మనకు కాళ్లు చేతులు ఆడవు. అందుకే మనం ఫోన్‌లో నెంబర్ సేవ్ చేసుకునేటప్పుడు రిజిస్టర్డ్ గూగుల్ అకౌంట్ ద్వారా కూడా సేవ్ చేయాలి. ఒకవేళ ఫోన్ పోయినా జీ మెయిల్ బ్యాకప్ ద్వారా మనం ఈ నెంబర్లను సంపాదించొచ్చు. కాంటాక్ట్ ఆప్‌లో క్లిక్ ద న్యూ కాంటాక్ట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన గూగుల్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసి సేవ్ చేసి ఓకే చేయాలి. ఆన్‌లైన్ బ్యాక్అప్ ఆన్‌లైన్‌లో మన యాప్స్, బ్రౌజర్ బుక్‌మార్క్స్, క్యాలెండర్, డాక్యుమెంట్లు దాచుకోవాలంటే ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత గూగుల్ ఆప్సన్ మీద క్లిక్ చేసి మన ఈమెయిల్ ఐడీని సెలక్ట్ చేసుకోవాలి. సింక్ అనెబుల్ అయిందో లేదో చూసుకోవాలి. ఇలా చేస్తే ఆన్‌లైన్‌లోనే మన బ్యాక్ అప్‌ను ఉంచుకోవచ్చు. ఫొటోల బ్యాక్అప్ ఫోన్‌లో మనకు అత్యంత ప్రధానమైంది మన ఫొటోలే. ఎంతో అమ్యూలమైన క్షణాలను ఫొటోల రూపంలో దాచుకుంటాం. ఫోన్ పోతే అవన్నీ మనకు దూరం అవుతాయి. అందుకే ఫొటోల బ్యాక్ అప్ తప్పనిసరి. గూగుల్ ఫొటోస్ ఆటో బ్యాకప్ ఫీచర్ దీనికి ఉపయోగపడనుంది. ఈ యాప్‌ను మన డివైజ్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసి గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయితే మనకు ఫొటోలు సులభంగా బ్యాక్ అప్ అవుతాయి. |