ప్రపంచం లోనే రెండవ అతి పెద్దది అయిన భారత రైల్వే వ్యవస్థ లో అత్యాధునిక హంగులతో కూడిన క్రిస్ (centre for railway information system) అందుబాటులోనికి వచ్చింది. ఇంతకు ముందు మాన్యువల్ సిస్టం కొనసాగేది, ఆ తర్వాత ఎఫ్ ట్రానిక్ సిస్టం అందుబాటులోనికి వచ్చింది. అయితే ఇప్పుడు వాటికంటే సరికొత్తగా క్రిస్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు.ఈ వ్యవస్థ ఇటీవలే అందుబాటులోనికి వచ్చింది.ఈ కంట్రోలింగ్ వ్యవస్థ కింద ముఖ్యంగా కమర్షియల్,ఎలక్ట్రికల్, మెకానికల్,ఇంజినీరింగ్,సిగ్నల్ అండ్ టెలి కమ్యునికేషన్, RPF సెక్యూరిటీ తదితర విభాగాలన్నీ పనిచేస్తాయి. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ లో మారుమూల ఏ సాంకేతిక లోపం తలెత్తినా నిమిషాల వ్యవధిలో కంట్రోలింగ్ వ్యవస్థ లోని సిబ్బంది కి తెలిసి పోతుంది.ప్రమాదం జరిగిన సెకన్ల లోనే సిబ్బంది కి తెలిసి పోతుంది. దీని వలన సిబ్బంది అప్రమత్తం అవడం తో పాటు భారీ ప్రమాదాలు నివారించ వచ్చు. ఈ వ్యవస్థ తో పాటు జిపిఎస్ సిస్టం ను కూడా రైల్వే అందుబాటులోనికి తెచ్చింది. గతం లో కంట్రోలింగ్ వ్యవస్థ మాన్యువల్ గా ఉన్నపుడు కొన్ని పొరపాట్లు జరిగేవనీ, కానీ ఆధునీకరించిన ఈ వ్యవస్థ ద్వారా మానవ తప్పిదాలు జరగడం చాల అరుదు అనీ అంతే గాక తాము ప్రయాణించాల్సిన రైలు ఎక్కడ ఉందో స్మార్ట్ ఫోన్ లో సైతం తెలుసుకునే పరిజ్ఞానాన్ని అందుబాటులోనికి తెచ్చామని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యవస్థను మరింత ఆధునీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. |