ఎలక్ట్రానిక్ వ్యర్థాలు.. ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశం. వందల వేల టన్నుల ఈ-వ్యర్థాలు అన్ని దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయ్. ఆ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తిరిగి ఉత్పత్తులుగా మార్చే ప్రక్రియ అన్ని దేశాల్లో సక్రమంగా సాగట్లేదు. ఈ నేపథ్యంలో ఈ-వ్యర్థాలు అధిక మోతాదులో దిగుమతి అవుతున్నాయి. విదేశాల నుంచి టన్నుల కొద్దీ భారత్‌లో వచ్చి పడుతున్నాయి. ఇందులో అమెరికాదే అగ్రస్థానం. ఆ దేశం నుంచి 42 శాతం వ్యర్థాలు ఇక్కడికి వస్తున్నాయి. చైనా నుంచి 30 శాతం వ్యర్థాలు దిగుమతి అవుతున్నాయి. యూరోపియన్ దేశాల నుంచి 18 శాతం, జపాన్, తైవాన్, దక్షిణకొరియా లాంటి ఆసియా దేశాల నుంచి 10 శాతం వ్యర్థాలు భారత్‌కు వచ్చి చేరుతున్నాయి. ఇలా భారత్‌కు వచ్చిపడుతున్న ఈ-వ్యర్థాలలో భిన్నమైన వస్తువులు ఉంటున్నాయి. వీటిలో కంప్యూటర్ వ్యర్థాలదే అగ్రస్థానం. వీటితో పాటు మొబైల్స్, ఎలక్ర్టికల్, మెడికల్ వ్యర్థాలు కూడా ఉంటున్నాయి. టెలికాం పరికరాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఏవి ఎంత శాతం...? - కంప్యూటర్ పరికరాలు 68 శాతం - టెలికాం పరికరాలు 12 శాతం - ఎలక్ర్టికల్ పరికరాలు 8 శాతం - వైద్య పరికరాలు 7 శాతం - గృహోపకరణ పరికరాలు 5 శాతం ఇన్ని వ్యర్థాల వల్ల భారత్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. భారత్‌లోనూ మొబైళ్లు.. వైద్య పరికరాలు, కంప్యూటర్ పరికరాల వాడకం అధిక మోతాదులో ఉండడంతో టన్నుల టన్నుల కొద్దీ పేరుకుపోతున్న ఈ-వ్యర్థాలను ఎలా రీ సైక్లింగ్ చేయాలో తెలియని పరిస్థితి. ఈ-వ్యర్థాలు ఏమవుతున్నాయి..? - ఈ వ్యర్థాలను తిరిగి ఉపయోగించేలా చేయడానికి ప్రవేటు రంగమే ఎక్కువ కృషి చేస్తోంది. - 90.5 శాతం అనధికారికంగానే రీసైక్లింగ్ జరుగుతోంది - 8 శాతం వ్యర్థాలు భూమిలో వృథాగా కలిసిపోతున్నాయి. -1.5 శాతం వ్యర్థాలు మాత్రమే సక్రమంగా రీసైక్లింగ్ అవుతున్నాయి. భారత్‌లో ప్రస్తుత వివిధ నగరాల్లో ఉన్న రీసైక్లింగ్ యూనిట్లు (ఉత్పత్తి టన్నుల్లో)
ఈ-వ్యర్థాల వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి నేరుగా భూమిలో కలవడం వల్ల వీటిలో ఉండే విష పదార్థాలు భూగర్భ జలాలను కలుషితం చేసే అవకాశాలున్నాయి. అంతేకాక సారవంతమైన భూములను కూడా ఈ విష పదార్థాలు కలుషితం చేయనున్నాయి. దీని వల్ల దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, కాలేయం, కళ్లపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయి. |
||||||||||||||||||