సిడిఎంఎ పద్ధతిలో మొబైల్ సేవలందించి మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇక ఆ టెక్నాలజీకి గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించుకుంది. ఫేస్-1 సర్కిల్స్‌గా గుర్తించబడిన ఆంధ్రప్రదేశ్, ముంబై, ఢిల్లీ, కోల్‌కటా, మహారాష్ట్ర, గుజరాత్, యుపి ఈస్ట్, యుపి వెస్ట్, మధ్యప్రదేశ్ సర్కిల్స్‌లో మే31తో రిలయన్స్ సిడిఎంఎ సేవలు అధికారికంగా నిలిచిపోయాయి. దీనితో 4జి సేవలతో పాటు సిడిఎంఎ సేవలు కూడా కొనసాగిస్తారనే వాదనకు తెరదించినట్లయ్యింది. రిలయన్స్ కొత్తగా వోల్ట్ అనే టెక్నాలజీతో 4జి సేవలు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వోల్ట్ టెక్నాలజీని ప్రమోట్ చేసేందుకే ఎల్‌వైఎఫ్ పేరుతో ఒక కొత్త బ్రాండు స్మార్ట్‌ఫోన్‌ను కూడా మార్కెట్ చేస్తోంది. జియో అనే పేరుతో పూర్తిగా 4జి ఇంటర్‍నెట్ ఆధారిత మొబైల్ సేవలు అందించాలని కూడా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ టెక్నాలజీ మీద దృష్టి పెట్టేందుకు వీలుగా మే31 నుంచీ సిడిఎంఎ సేవలు నిలిపివేసింది. ప్రస్తుతం ఉన్న సిడిఎంఎ వినియోగదారులంతా తమ సిడిఎంఎ సిమ్ కార్డులను 4జి వోల్ట్ టెక్నాలజీతో పని చేసే కొత్త సిమ్ కార్డులతో ఉచితంగా మార్పిడి చేసుకోవచ్చని సందేశాలు పంపించింది. సిడిఎంఎ సేవలు నిలిచిపోయినా, కొత్త సిమ్ కార్డులతో ప్రస్తుతం 2జి జిఎస్‌ఎం, 3జి సేవలు మాత్రమే లభిస్తున్నాయనీ వివిధ నగరాల్లో వినియోగదారులు చెబుతున్నారు. రిలయన్స్ సొంత 4జి సేవలు ఇంకా అన్ని నగరాల్లో ప్రారంభించలేదు కనుక ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. క్రమంగా ఒక్కో నగరంలో 4జి సేవలు మొదలుపెట్టినప్పుడు కొత్తగా ఇచ్చిన సిమ్‌లన్నీ ఆటోమాటిక్‌గా 4జికి అప్‍గ్రేడ్ అవుతాయని ఆశిస్తున్నారు. |