ప్రముఖ డేటా అనలిటికల్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన సామా టెక్నాలజీస్ రానున్న రోజుల్లో ఇండియా లో సుమారు 2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది.భారత దేశం లో తన అస్తిత్వాన్ని విస్తరించుకోవాలనే లక్ష్యం తో ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది. పూణే యందలి ప్రత్యెక ఆర్థిక మండలి (సెజ్) లో 45,000 చదరపు అడుగుల వైశాల్యంలో అధునాతన సౌకర్యాలతో తన లేటెస్ట్ కంపెనీ ని ప్రారంభించనున్నట్లు సామా టెక్నాలజీస్ ప్రకటించింది.ప్రస్తుతం ఈ కంపెనీ లో 650 మంది ఉద్యోగులు ఉండగా ఈ సంఖ్యను 1000 కి పెంచనున్నట్లు కూడా ప్రకటించింది. భారత్ లో కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన వసంత్ శెట్టి మాట్లాడుతూ దేశం లో సమర్థమైన డేటా అనలిస్టులు మరియు అనలిటిక్ కంపెనీ ల కొరత ఎక్కువగా ఉందనీ తాము ఆ కొరత తీర్చడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. దేశం లోని ప్రముఖ యూనివర్సిటీ ల స్థాయి నుండే సమర్థ మైన టెక్నాలజీ ని ఉపయోగించడం ద్వారా అనలిటిక్ కల్చర్ ను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం కంపెనీ సుమారు 2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతోంది. కంపెనీ ప్రాథమికంగా ఇన్సూరెన్స్,CPG,హై టెక్,లైఫ్ సైన్సెస్,మరియు హెల్త్ కేర్ రంగాలలో తన కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది. |