• తాజా వార్తలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం: ఫిట్ నెస్ మరియు ఆరోగ్యకరమైన జీవితానికి 6 యోగా యాప్స్

భారత దేశం ప్రపంచానికి అందించిన  అత్యద్భుతమైన కానుక యోగా అనేది  అన్ని ప్రపంచ దేశాలూ ముక్త కంఠం తో ఒప్పుకుంటున్న సత్యం. ఒక మనిషి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి యోగా అనేది అత్యంత అవశ్యకమైన సాధనo  గా నిలిచింది. నేడు యోగా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉద్యమం లా సాగుతుందంటే భారతీయులుగా మనం ఎంతగానో గర్వించ వలసిన విషయం. మొన్న జరిగిన ప్రపంచ యోగా దినోత్సవం ఈ ఉద్యమానికి మరింత ఊపు ను తీసుకు వచ్చింది. రెండవ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలను యోగోన్ముఖులను చేయడానికి ETCIO సరికొత్త యోగా యాప్ లను విడుదల చేసింది. ఈ యాప్ లద్వారా ప్రజలు తమ శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడు కోవడం తో పాటు ఒక ఆరోగ్య కరమైన జీవన శైలి ని అవలంబించుకోవచ్చు. ఒక్కసారి ఆ యాప్ ల గురించి చూద్దాం.

డైలీ యోగా

ఈ యాప్ లో యోగా లో అన్ని స్థాయిలు అంటే ప్రారంభ. మధ్యస్థ , ఉన్నత స్థాయిలలో యోగా తరగతులు, ఆసనాలు, షెడ్యూల్డ్ ప్లాన్ లు, మెడిటేషన్ ట్రాక్ లు ఉంటాయి. ఈ యాప్ సుమారు 100 కి పైగా యోగా సెషన్ లను అందించే 8 యోగా నిపుణులను కలిగి ఉంటుంది. 9 మెడిటేషన్ ట్రాక్ లూ, 500 యోగా పోజు లూ ఈ యాప్ లో ఉంటాయి. ఈ యాప్ గేమింగ్ మోడ్ లో ఉంటుంది. అంటే మీరు సాధన చేసే యోగా కు మీకు మీరే రివార్డ్ పాయింట్ లు ఇచ్చుకోవచ్చు అన్నమాట. అంతేగాక మీ యోగా స్నేహితులతో కూడా కనెక్ట్ అవ్వవచ్చు.

సెల్యూట్ ద డెస్క్

మీ డెస్క్ వద్దనే మీరు యోగా సాధన చేసే విధంగా ఈ యాప్ డెవలప్ చేయబడింది. ఇందులో మొత్తం రెండు గైడెడ్ రిలాక్సేషన్ సెషన్ లతో కూడిన 27 యోగా పోజులు ఉంటాయి. ఇవి అనుసరించడానికి వీలుగా ఆడియో, వీడియో, లిఖిత సూచనలతో కూడి ఉంటాయి. ఇది మొత్తం రెండు గంటల పాటు ఉంటుంది.

పాకెట్ యోగా

సమయం ,క్లిష్టత లను బట్టి 27 యోగా సెషన్ లు ఇందులో ఉంటాయి. మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయడానికి సుమారు 200 వివరణాత్మక పోజు చిత్రాలు ఇందులో ఉంటాయి. ఇది ఒక పోజు నిఘంటువు లాగా ఉపయోగ పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మీ యోగ సాధన చరిత్రను సమీక్షిస్తూ మీకు తెలియ జేస్తూ ఉంటుంది.

ఎయిర్ ప్లేన్ యోగా

విమానం లో యోగాసనాలు వేయడానికి అనువుగా ఈ యాప్ ను డిజైన్ చేసారు. ఈ యాప్ మొత్తం 24 సులభమైన సమర్థవంతమైన యోగాసనాలను కలిగి ఉంటుంది. ఇవి సిట్టింగ్ మరియు స్టాండింగ్ పోజు లలో ఉంటాయి. 18 సిట్టింగ్ మరియు 9 స్టాండింగ్ పోజులు వివరణాత్మక చిత్రాలు, ఆడియో రికార్డింగ్ లూ, లిఖిత సూచనల  ద్వారా ఈ యాప్ లో అందిoచడం జరిగింది.

సింప్లీ యోగా

ఇది మీకు వ్యక్తిగత యోగా గురువు లాగా ఉపయోగపడుతుంది. ఇది వివిధ రకాల కాల వ్యవధులలో అంటే 20,40,మరియు 60 నిమిషాలలో ఉన్న వీడియో లను కలిగి ఉంటుంది. నిపుణులైన యోగా శిక్షకులచే ఈ వీడియో లు రూపొందించబడి ఉంటాయి.సుమారు 80 కి పైగా యోగా పోజులలో ఉన్న వీడియో మరియు ఆడియో సూచనలను ఈ యాప్ కలిగి ఉంటుంది.

కిడ్స్ యోగా వర్స్  I am Love

ఇది ప్రపంచం లో మొట్ట మొదటి ఐ పోడ్ యోగా యాప్. ఇది ప్రత్యేకించి పిల్లల కోసం డిజైన్ చేయబడింది. ఇందులో యోగాసనాలు చిన్న చిన్న కథల రూపం లో , హాస్యం కలిగించే సంభాషణల రూపం లో ఉంటాయి. అంతే  గాక ఇవి చాలా సులభంగానూ, రిలాక్సేషన్ కు అనువుగానూ ఉంటాయి. 

 

జన రంజకమైన వార్తలు