• తాజా వార్తలు

ఇంటర్ నెట్ మయం కాబోతున్న దేవాలయాలు, మసీదులు

బెంగళూరు మహానగరానికి సుమారు 30 కిలోమీటర్ ల దూరం లో ఉన్న రామ్ నగర ఒక చిన్న పట్టణం. ఆ పట్టణం లో  మసీదు ఒకటి ఉంది. అతి త్వరలోనే ఆ ప్రదేశం అంతా దగ్గరలో ఉన్న బెంగళూరు మాదిరిగా ఇంటర్ నెట్ మయం కాబోతుంది. ఆ పట్టణం లో ఉన్న మసీదే ఆ ఏరియా మొత్తానికీ ఇంటర్ నెట్ హబ్ గా మారబోతోంది. రామనగర ఒక్కటే కాదు గ్రామీణ భరతం లో ఉన్న సుమారు 10,000 వరకూ ఉన్న చిన్న పట్టణాలూ గ్రామాలలో ఉన్న దేవాలయాలూ, మసీదులూ అతి త్వరలోనే ఇంటర్ నెట్ హబ్ లుగా మారనున్నాయి. గ్రామీణ భారతాన్ని కూడా ఇంటర్ నెట్ మయం చేసి  హై స్పీడ్ కనెక్టివిటీ ని గ్రామీణ భారతం లోని పల్లెలకు చిన్న చిన్న పట్టణాలకు అందించే విధంగా టాటా కమ్యూనికేషన్స్ సర్వీసెస్ సంస్థ ప్రణాళిక లు రచిస్తుంది.

“బ్రాడ్ బ్యాండ్ క్వాలిటీ తో కూడిన ఇంటర్ నెట్ ను అతి తక్కువ ధరలో గ్రామీణ భారత దేశం లోని పల్లెలకూ, పట్టణాలకూ మేము అందించాలని అనుకుంటున్నాము. గ్రామాలలో ఎక్కువ జన సామర్థ్యం ఉండే ప్రదేశాలు మసీదులు, దేవాలయాలే అని మా పరిశోధన లో తేలింది. కాబట్టి ముందుగా ఈ ప్రదేశాలలో ఇంటర్ నెట్ కనెక్షన్ ను ఏర్పాటు చేసినట్లయితే ఆ తర్వాత దాని పరిధిని పెంచుకుంటూ పోవచ్చని మేము భావిస్తున్నాము.” అని టాటా కమ్యూనికేషన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయిన జూలీ వుడ్స్ వెల్లడించారు.టాటా కమ్యూనికేషన్స్ లో పనిచేసే ఉద్యోగుల నుండి షేప్ ది ఫ్యూచర్ అనే అనే కార్యక్రమం తో అనేక సలహాలను , ఐడియా లను స్వీకరించింది. అలా  ఉద్యోగులు అందించిన ఐడియా లలో నుండి షార్ట్ లిస్టు చేయబడిందే ఈ ఐడియా. అంటే దేవాలయాల్లో, మసీదులలో ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలనే ఆలోచన టాటా ఉద్యోగులనుండి వచ్చింది అన్నమాట.

ఈ ఇంటర్ నెట్ కనెక్టివిటీ కోసం టాటా కమ్యూనికేషన్స్ బ్రాడ్ బ్యాండ్ తో కానీ, వై ఫై మీద కానీ ప్రత్యక్ష్మగా ఆధారపడ`దలచుకోలేదు. ఈ రంగం లో అనుభవం కలిగి ఉండి  తమ విజన్  ను వాస్తవికత లోనికి నడిపించగలిగే మిగతా ఆపరేటర్ లతో జట్టు కట్టేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు టాటా కమ్యూనికేషన్స్ ప్రకటించింది. అంటే మన గ్రామీణ భారతం లో హై స్పీడ్ ఇంటర్ నెట్ ను మనం అతి త్వరలో చూడబోతున్నాం అన్నమాట.

 

జన రంజకమైన వార్తలు