కీలక ఉద్యోగులు రాజీనామాలు,చైనా సంస్థల నుంచి పోటీ, బ్రాండెడ్ సంస్థగా ఎదగడంతో వ్యయం.
ఒకప్పుడు మైక్రోమ్యాక్స్ ఫోన్లు ధరలు తక్కువగానే ఉండేవి. అయితే... అది రానురాను బ్రాండెడ్ సంస్థగా ఎదగడంతో యాడ్స్ కి అయ్యే వ్యయం, బ్రాండింగ్ కోసం పెట్టే ఖర్చు భారీగా పెరిగి ఫోన్ల ధరలు పెంచింది. పైగా బ్రాండెడ్ కంపెనీల పోటీని తట్టుకునే క్రమంలో తన నాణ్యత కూడా పెంచడం వల్ల ఉత్పత్తి వ్యయం కూడా పెరిగి రేటు పెరిగింది. దీంతో రేటు పెరగడంతో చాలామంది మైక్రోమ్యాక్స్ కంటే పెద్ద బ్రాండ్లకు మళ్లుతున్నారు. మరోవైపు మైక్రోమ్యాక్స్ కంటే తక్కువ ధరకు అనేక సంస్థలు ఆన్ లైన్లో విక్రయాలు చేస్తున్నాయి. చైనా బ్రాండ్లు ఫ్లాష్ సేల్స్ తో ఆకట్టుకుంటూ తక్కువ కాలంలోనే లక్షల ఫోన్లను విక్రయించేస్తున్నాయి. ఈ కారణాలన్నీ కలిసి మైక్రోమ్యాక్స్ ను దెబ్బతీశాయి. 2000 సంవత్సరంలో నలుగురు ఔత్సాహికులు ఏర్పాటు చేసిన ఈ సంస్థ కొద్దికాలంలోనే బాగా ఎదిగిపోయింది. 2008 నుంచి స్మార్ట్ ఫోన్ల రంగంలో ఉన్న కూల్ ప్యాడ్, ఒప్పో, జియోని వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని చాలావేగంగా అగ్రస్థానానికి చేరింది. అయితే... ఇప్పుడు ఆ సంస్థలే నేరుగా ఇండియన్ మార్కెట్లోకి రావడంతో మైక్రోమ్యాక్స్ మార్కెట్ పడిపోయింది. ఇదే కాకుండా 2014లో శ్యాంసంగ్ ను బీట్ అవుట్ చేసిన మైక్రోమ్యాక్స్ ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలూ కొన్ని దెబ్బతినిపించాయి. చైనాకు చెందిన అలీబాబా సంస్థ మైక్రోమ్యాక్స్లో 20 శాతం వాటా కొనుగోలు చేసింది. అనంతరం రెండింటి మధ్య విభేదాలు ఏర్పడి దారుణంగా నష్టపోయింది. మైక్రోమ్యాక్స్ ఎడ్డెం అంటే అలీబాబా తెడ్డెం అంటూ నష్టాలపాల్జేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. |