• తాజా వార్తలు

టాప్ 100 టెక్ యూనివర్సిటీ లలో మన IISC

ప్రపంచ అత్యుత్తమ టెక్నాలజీ యూనివర్సిటీ లలో మన దేశానికి చెందిన ఒక యూనివర్సిటీ చోటు సంపాదించింది. బెంగళూరు కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు కు ఈ జాబితాలో 99 వ స్థానం లభించింది. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్, కాల్ టెక్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ర్యాంక్ లు ఇచ్చిన సంస్థ పేరు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్ ఫర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.

ఈ సంస్థ ఆధారం చేసుకున్న అంశాలు.

  1. యూనివర్సిటీ లలో విద్య
  2. పరిశోధన
  3. అంతర్జాతీయ ప్రతిష్ట

ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అంశాలలో పోటీ పడి టాప్ 100 సంస్థల్లో ఒకటిగా మన దేశానికి చెందిన యూనివర్సిటీ చోటు సంపాదించిందంటే మనందరికీ ఆనందమే కదా!

 

జన రంజకమైన వార్తలు