ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్కే లక్ష్మన్ స్మృతి చిహ్నంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు.ఆర్కే లక్ష్మన్ యొక్క 94 వ జయంతి సందర్భంగా ఈ వెబ్ సైట్ ఆవిష్కరించబడింది. అంతేగాక ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కూడా ఆర్కే లక్ష్మన్ కు ఘనమైన నివాళిని అర్పించింది. ఆయన జన్మదినమైన అక్టోబర్ 25 వ తేదిన తమ లోగోలో ఆర్కే లక్ష్మన్ స్మృతి చిహ్నాన్ని ఉంచింది. ఆ చిహ్నంలో ఎడమ వైపు ఆర్కే లక్ష్మన్ యొక్క డ్రాయింగ్ లు, పెన్నులు మరియు పెన్సిళ్ళు,టేబుల్ లాంప్, పుస్తకాలూ,మధ్యలో లక్ష్మన్ యొక్క చిత్రం, కుడి వైపు ఆయన యొక్క వ్యంగ్య రచనలూ ఉంచింది. ఆ విధంగా ఆర్కే లక్ష్మన్ యొక్క గొప్పదనాన్ని ప్రపంచమంతా వీక్షిస్తారన్నమాట. భారతీయులుగా మనకు ఇది ఆనందదాయకం మాత్రమే కాదు,గర్వకారణం కూడా ! |