భారత్‌లో వైఫై వాడకం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఒకప్పుడు కొంతమందికి మాత్రమే పరిమితమైన ఈ సదుపాయం ఇప్పుడు అన్ని ఇళ్లలోనూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల అవసరాల కోసం భారత రైల్వే శాఖ దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయాన్ని కల్పించింది. ప్రస్తుతం ప్రముఖ పట్టణాలతో పాటు చిన్న నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఈ వైఫై సేవలు లభ్యమవుతున్నాయి. రైల్‌టెల్ ద్వారా ఈ వైఫై సేవలను అందిస్తున్న రైల్వేశాఖ త్వరలోనే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. ఐతే ఈ రైల్‌టెల్ అందిస్తున్న వైఫైని జనం తెగ వాడేస్తున్నారట. పట్టణాలను పక్కనపెడితే చిన్న పట్టణాల్లో ఈ వాడకం మరీ ఎక్కువగా ఉందట. చిన్న చిన్న నగరాల్లో ఇంటర్నెట్ ఉపయోగించే వినియోగదారులు ఎక్కుమంది స్మార్టుఫోన్లను వాడుతున్నారు. వారిలో అధిక శాతం ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఐతే అన్ని అవసరాలకు ఈ సదుపాయాన్ని వాడటం కష్టం. ముఖ్యంగా పెద్ద వీడియోలతో పాటు ఎక్కువ ఎంబీ ఉన్న ఫైల్స్‌ను మొబైల్ డేటాతో వాడటం కష్టం. ఒకవేళ వాడినా డేటా వెంటనే హరించుకుపోతుంది. ఇక డోన్‌లోడ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో చిన్న పట్టణాల్లోని చాలా మంది వినియోగదారులు రైల్వే స్టేషన్‌కు వెళ్లి తమకు కావాల్సిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఫోన్ సాఫ్ట్‌వేర్లను అప్‌గ్రేడ్ చేయడం చేస్తున్నారట. అంతేకాదు సినిమాలు, వీడియోలను కూడా యథేచ్ఛగా డౌన్‌లోడ్ చేసి చూస్తున్నారట. దీనికి కారణం రైల్‌టెల్ అందిస్తున్న వైఫై సేవలు చాలా వేగవంతమైనవి కావడమే. టైర్-2 నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఈ వాడకం మరీ ఎక్కువగా ఉందని ఈ రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైపై నెట్‌వర్క్స్‌ను ఇన్‌స్టాల్ చేసిన గూగుల్ తెలిపింది. హెవీ డౌన్‌లోడ్స్ కారణంగా చాలా చోట్ల నెట్ స్లో అయిపోయిందని ఆ సంస్థ పేర్కొంది. ఒక్క ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోనే వారానికి 1 లక్ష మంది వినియోగదారులు వైఫైని ఉపయోగించుకుంటున్నారట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. దీని కోసం రైల్ టెల్ 45,000 కి.మీ దూరం ఆప్టిక్ నెట్‌వర్క్ కేబుల్స్ వేసింది. ప్రతి రోజూ ఒక్కో యూజర్ 25 ఎంబీ 3జీ డేటాను ఉపయోగిస్తున్నారట. Times New Roman";color:#222222'>, ఎమోజీలను వాడుకోవచ్చని చెప్పింది. ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ల యుగం కావడంతో డెస్క్‌టాప్ మీద చాటింగ్ తగ్గిపోయిందని ఈ నేపథ్యంలోనే మెసెంజర్‌ను ఆపేస్తున్నట్లు యాహూ పేర్కొంది. |