టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI ),700,900,మరియు 2100 మెగా హెర్ట్జ్ లకు సంబంధించి మొత్తం 7 బ్యాండ్ లలో రిజర్వు ధరకు వేలం నిర్వహించడానికి కన్సల్టేషన్ పేపర్ ను విడుదల చేసింది.స్పెక్ట్రమ్ యొక్క క్వాంటమ్ వేలం,స్పెక్ట్రమ్ బ్లాక్ సైజు,స్పెక్ట్రమ్ క్యాప్,రిజర్వు ధరను నిర్ణయించే పద్దతుల గురించి స్టేక్ హోల్డర్ ల యొక్క సలహాలను స్వీకరించడానికి ట్రాయ్ సిద్దం గా ఉన్నది. వాస్తవానికి ఈ పేపర్ ఎప్పుడో విడుదల కావలసి ఉండగా భారత టెలికాం డిపార్ట్ మెంట్ పంపిన సమాచారం తగినంత లేదనీ అందుకే ఆలస్యం అయిందనీ ట్రాయ్ తెలిపింది.ఆ సమాచారం కన్సల్టేషన్ పేపర్ తయారు చేయలేనంత సంక్లిష్టం గా ఉందనీ ,ఏది ఏమైనప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం లోనే వేలం నిర్వహిస్తామని ట్రాయ్ వెల్లడించింది.భారత టెలికాం డిపార్టుమెంటు అక్టోబర్ 16 న కొంత సమాచారాన్ని లేఖ రూపంలో పంపించింది.ఈ సమాచారం కూడా అసంపూర్ణంగా ఉన్నది.కాబట్టి నవంబర్ 16 న మరొక లేఖను పంపింది.సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న సమాచారం తో ట్రాయ్ ఒక కన్సల్టేషన్ పేపర్ ను విడుదల చేసింది. ట్రాయ్ చెబుతున్న దాని ప్రకారం,జూలై 9 న ప్రభుత్వం పంపిన లేఖలో 700 Mhz,800 Mhz,1800 Mhz,2100 Mhz,2300 Mhz,and 2500 Mhz లలో స్పెక్ట్రమ్ వేలానికి ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిసింది.అక్టోబర్ 16,2014 న ప్రచురితమైన రెగ్యులేటర్ ప్రకారం రిజర్వు ధరను 2300 Mhz మరియు 2500 Mhz లకు కూడా వర్తింప జేయాలని ప్రభుత్వం భావించింది. కాబట్టి స్టేక్ హోల్డర్ లు తమ కామెంట్ లను అభిప్రాయాలను డిసెంబర్ 21 లోపు,కౌంటర్ కామెంట్ లను డిసెంబర్ 28 లోపు పంపాలని ఆదేశించింది.కాలపరిమితి పెంచేది లేదని కూడా ట్రాయ్ స్పష్టం చేసింది.ఆ ఆదేశాలకు తగ్గట్టు వచ్చిన కామెంట్ లను ప్రస్తుతం ట్రాయ్ పరిశీలనలో ఉంచింది.మొత్తానికి ఈ ఆర్థిక సంవత్సరం లోనే స్పెక్ట్రమ్ యొక్క వేలం నిర్వహించే పనిలో ట్రాయ్ ఉన్నది. |