సాంకేతిక పరిజ్ఞాన అనువర్తనాలను తేలికగా అంది పుచ్చుకునే మన భారతీయులు తాజాగా మరో సరికొత్త(?) రికార్డు ను సృష్టించారు.అదీ అలాంటి ఇలాంటి రికార్డు కాదు.పరమ చెత్త( కొత్త) రికార్డు. పోర్న్ వెబ్ సైట్ లను చూడడం లో మన వాళ్ళు పాశ్చాత్యులను మించి పోయారు.బరితెగింపు కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే కెనడా ను సైతం వెనక్కి నెట్టి బూతు వెబ్ సైట్ లు అత్యధికంగా చూసే దేశాల్లో మన దేశాన్ని ఏకంగా మూడవ స్థానం లో నిలిపారు.మొదటి రెండు స్థానాల్లో అమెరికా మరియు బ్రిటన్ లు ఉన్నాయి.ఈ ట్రెండ్ చూస్తుంటే ఈ అంశం లో దేశాన్ని మొదటి స్థానం లో నిలిపేదాకా మన వాళ్ళు నిద్రపోయేట్లు లేరు.అసలు ఈ స్థానాలేంటి?ఈ విషయాలు ఎవరు వెల్లడించారు?తదితర విషయాలు తెలియాలంటే ఈ వ్యాసం చదవండి. ప్రపంచం లోనే అతి పెద్ద అడల్ట్ వెబ్ సైట్ అయిన పోర్న్ హబ్ తన వీక్షకుల సంఖ్యను ఇటీవలే ప్రకటించింది.ప్రతి దేశము తన సగటు వినియోగానికి కొంచెం అటూ ఇటూ గా పోర్న్ ను వాడుతుంటే భారత్ మాత్రం తన సగటు విసిత్ లో ఒక నిమిషం పెరుగుదల ను చూపించి రికార్డు సృష్టించింది.ఈ విషయం లో అగ్ర స్థానం లో కొనసాగుతున్న అమెరికా కూడా కేవలం 11 సెకన్ల పెరుగుదలను మాత్రమే చూపించింది. ఈ వెబ్ సైట్ ప్రకటించిన వివరాల ప్రకారం పోర్న్ వెబ్ సైట్ లను చూడడానికి వినియోగదారులు డెస్క్ టాప్ లకంటే స్మార్ట్ ఫోన్ లూ,టాబ్లెట్ లనే ఎక్కువ ఉపయోగిస్తున్నారు.2015 వ సంవత్సరం లో పోర్న్ హబ్ సుమారు 2 కోట్ల 12 లక్షల విజిట్ లను పొందింది.ప్రతీ నిమిషానికి 40,000 విజిట్ లు ప్రతీ గంటకు 2 లక్షల నలభై వేల విజిట్ లను పోర్న్ హబ్ కలిగి ఉన్నది. మొత్తం స్మార్ట్ ఫోన్ లనుండే సుమారు 55% విజిట్ లు రాగా ఇది గత సంవత్సరం కేవలం 45%మాత్రమే ఉండడం విశేషం.అదే డెస్క్ టాప్ ల నుండి కేవలం 36%మాత్రమే వీక్షించినట్లు వెబ్ సైట్ వెల్లడించింది. 2015 వ సంవత్సరం లో ఈ వెబ్ సైట్ లో ఎక్కువ మంది భారతీయులు వెతికిన పదాలు “ఇండియన్,భాబీ,ఆంటీ.టీన్ లు.టాప్ సెర్చేడ్ పోర్న్ స్టార్ లలో బొల్లి వుడ్ నటి సన్నీ లియోని దే అగ్ర స్థానం.మొత్తం మీద ప్రపంచం లో ఎక్కువ మంది వెతికిన పదం “లెస్బియన్”. మొత్తo గా చూసుకుంటే ఈ విజిట్ లు ఎక్కువగా రాత్రి 9 గంటల నుండీ అర్థ రాత్రి మధ్యలో జరిగినట్లు సైట్ ప్రకటించింది. ఇదీ మన భారతీయ నెట్ వినియోగదారుల బూతు వీక్షణ గాథ. |