• తాజా వార్తలు

ఊపందుకున్న ఐ ఫోన్ అమ్మకాలు

సంవత్సరం ఆపిల్ కంపెనీ నుండి i-ఫోన్ 6s మరియు 6s ప్లస్ అనే రెండు సరికొత్త మోడల్ లు వచ్చిన సంగతి టెక్ ప్రియులకు విదితమే.అయితే అత్యంత సాధారణ స్థాయిలో మొదలైన ఆ మోడల్ ల అమ్మకాలు భారత్ లోని వినియోగదారులు రంగ ప్రవేశం చేయడంతో ప్రపంచమంతటినీ తన వైపు ఆకర్షితులను చేశాయి.సాదాసీదా అమ్మకాలతో ప్రారంభమైన ఆపిల్ యొక్క లోకల్ అమ్మకాలు ప్రమోషనల్ ఆఫర్ లతోను ,డిస్కౌంట్ ల సహాయం తోనూ కంపెనీ యొక్క అత్యుత్తమ త్రైమాసిక అమ్మకాలను నమోదు చేశాయి.

ఆపిల్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒక్క నవంబర్ నెల లోనే 413,500 లేటెస్ట్ i ఫోన్ లను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.ఇది దాదాపు ఆపిల్ గత అక్టోబర్ –డిసెంబర్ త్రైమాసికం లో ఉత్పత్తికి సమానం.అక్టోబర్ నుండీ నవంబర్ 15 వరకూ ఆపిల్ మొత్తం 562,500 i ఫోన్ లను ఉత్పత్తి చేసింది.కానీ గత సంవత్సరం త్రైమాసికం మొత్తం కలిపినా కేవలం 500,000 యూనిట్ లను మాత్రమే ఉత్పత్తి చేసింది. దీని బట్టి ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఏ విధంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

i ఫోన్ 6 s మరియు 6s ప్లస్ మోడల్ లను ఆపిల్ ఇండియాలో అక్టోబర్ 16 న విడుదల చేసింది.వాటి ధర ల యొక్క రేంజ్ Rs62,900-Rs92,000 గా ఉంది.ఈ ధర అనేది మోడల్ ను బట్టి ,మెమరీ ని బట్టి మారుతూ ఉంటుంది.ఇది యూ .ఎస్.మిడిల్ ఈస్ట్,సింగపూర్ ,హాంకాంగ్ లాంటి దేశాల స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో దాదాపు 14,000 నుండి 16,000 వరకూ ఎక్కువ.ఇంతటి ఎక్కువ ధరలు వినియోగదారులను కలవరపెడతయేమోనని భావించిన ఆపిల్ యాజమాన్యం డిస్కౌంట్ లను ఆఫర్ లను ప్రకటించింది.6s మరియు 6 s ప్లస్ యొక్క ధరలను ప్రపంచ వ్యాప్తంగా సడలించింది.ఈ చర్య దీని అమ్మకాలపై భారీగా ప్రభావాన్ని చూపించింది.

Rs 34000 రూపాయల వరకూ ఆదా చేసుకునే బయ్ బ్యాక్ ఆఫర్ ను దీవాలి కి ముందు ప్రకటించింది.వెంటనే ఆపిల్ యొక్క అమ్మకాలలో అనూహ్యమైన పెరుగుదల వచ్చింది.మొదటి నెలలోనే 413,500 i ఫోన్ లను ఇండియా కు ఎగుమతి చేసింది.ఈ ఆర్థిక సంవత్సరం లో ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో 1.7 మిలియన్ ల i ఫోన్ లను ఇండియా దిగుమతి చేసుకుంది.ఇది దాదాపు నెలకు 142,000 యూనిట్ లకు సమానం.

వీటిలో అత్యంత ప్రాముఖ్యమైన మోడల్  16 GB మెమరీ గల i ఫోన్ 6s ,లేటెస్ట్ i ఫోన్ మోడల్ ల లో ఇది అతి చవకైనది.ఇది సుమారు 176,000 యూనిట్ లు అమ్ముడు పోయింది. డిసెంబర్ నెల ముగిసే నాటికి దీని విలువ  700,000యూనిట్ లతో రికార్డు సృష్టించింది.

 

జన రంజకమైన వార్తలు