స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇది నిజంగా శుభవార్త లాంటిదే. త్వరలో మొబైల్ ఫోన్ల ధరలు దిగిరానున్నాయి. కేంద్ర వార్షిక బడ్జెట్ లో సెల్యూలర్ మొబైల్ ఫోన్.. (కెమెరా మాడ్యూల్, ఛార్జర్, ఎడాప్టర్)యాక్ససరీస్‌పై కస్టమ్స్ డ్యూటీని తగ్గించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. Union Budget 2019 ప్రవేశపెట్టిన సంధర్భంగా బడ్జెట్ ప్రసంగంలో మొబైల్ ఫోన్ యాక్ససరీస్‌పై పన్ను సుంకాన్ని తగ్గించనున్నట్టు మంత్రి సీతారామన్ వెల్లడించారు.
భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు రోజురోజుకీ డిమాండ్ పెరిగిపోతోంది. టెలికం రంగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ ఉన్న ఇండియాలో వైర్ లెస్ సబ్ స్క్రైబర్లు 1.5 బిలియన్ల (150కోట్లు) మంది ఉండగా ఇంటర్నెట్ సబ్ స్క్రైబర్లు 512 మిలియన్ల (51.2కోట్లు) మంది యూజర్లు ఉన్నారు. 2018లో 14.5 శాతం వృద్ధిరేటు సాధించగా.. 2021 నాటికి ఇండియాలో మొబైల్ సబ్ స్క్రిప్షన్ల సంఖ్య 1.4 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
2019లో టెలికం రంగం 15శాతం అభివృద్ధిని సాధించింది. 2018 కేంద్ర బడ్జెట్ లో కూడా మొబైల్ ఫోన్లపై విధించే పన్ను సంకం మళ్లీ 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగింది. ఇండియాలో దేశీయ మొబైల్ ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా కస్టమ్స్ డ్యూటీని పెంచేశారు. 2017లో ప్రభుత్వం 10శాతం కస్టమ్స్ డ్యూటీని ప్రకటించింది. డిసెంబర్ నెలలో అది 15శాతానికి పెరిగింది. 2018లో చివరిగా 20శాతానికి చేరుకుంది.
ఇదిలా ఉంటే పన్ను సుంకాన్ని పెంచడంతో కొన్ని విదేశీ స్మార్ట్ ఫోన్ మేకర్లు అయిన ఆపిల్, గూగుల్ కంపెనీలపై ప్రభావం పడనుంది. ఎందుకుంటే ఈ రెండు టెక్ దిగ్గజాలు దిగుమతులపైనే భారీగా ఆధారపడి ఉన్నాయి. భారతీయ మొబైల్ మేకర్లకు స్మార్ట్ ఫోన్ల ధర చౌకగా ఉండటం మరో సవాల్ గా మారింది.
చైనా నుంచి ఇంపోర్ట్ అయిన స్మార్ట్ ఫోన్లకు ఇండియాలో ఎక్కువ గిరాకీ ఉండటంతో దేశీయ మొబైల్ తయారీ కంపెనీలకు గట్టి పోటీ నెలకొంది. స్వదేశంలోనే ఉత్పత్తులకు ప్రాముఖ్యతనిచ్చేలా దేశీయ మొబైల్ మేకర్లకు సపోర్ట్ చేసేందుకు ప్రభుత్వం ట్యాక్సులను పెంచింది. మరి ముందు ముందు మేక్ ఇన్ ఇండియా దిశగా అడుగులు పడతాయా లేదా అన్నది చూడాలి.